Begin typing your search above and press return to search.
సినీ పరిశ్రమకు ప్రభుత్వ అండః మంత్రి
By: Tupaki Desk | 22 May 2021 8:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ అయన్నారు. శనివారం పలువురు ఇండస్ట్రీ ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అందులో తమ సమస్యలు పేర్కొని, వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
లాక్ డౌన్ కారణంగా సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అంగీకరించిన మంత్రి.. వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక, ప్రతీ కార్మికుడికి వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కరోనా నియంత్రణ కోసమే ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోందని, దీన్ని అందరూ అర్థం చేసుకొని, సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజ్ చేసుకోవాలని సూచించారు.
గతేడాది మొదటి లాక్ డౌన్ సమయంలో చిత్రపరిశ్రమపై ఆధారపడిన వారికి నిత్యావసరాలు పంపిణీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమకు అండగా నిలిచారని, ఇప్పుడు కూడా సహాయం చేయాలని వారు కోరారు.