Begin typing your search above and press return to search.
డైరెక్టర్ అంటూ టోకరా! మోసాల కి 'లేడీ' అరెస్ట్!!
By: Tupaki Desk | 23 Jun 2019 10:11 AM GMTసోషల్ మీడియా ముప్పు ఏ రేంజులో పొంచి ఉందో చెప్పేందుకు ఇదో ఫక్తు ఎగ్జాంపుల్. సామాజిక మాధ్యమాల్లో ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసి వేలు - లక్షల్లో దండుకుని ఎలా మోసం చేయొచ్చో ప్రాక్టికల్ గా చూపించింది ఈ కిలేడీ. అప్పనంగా కొట్టేసిన సొమ్ముతో జల్సాలు చేసే ఆవిడ మోసం వెంటే జైలు ఊచలు కూడా లెక్కించాల్సి ఉంటుందని ఊహించలేదు పాపం. ఎట్టకేలకు సదరు లేడీ ఫేక్ సీరియల్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ పోలీసులకు చిక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
చిత్తూరు జిల్లా వాయలపాడుకు చెందిన శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుస్మిత బెంగళూరు- అత్తూరులో నివాసం ఉంటోంది. బుల్లితెర సీరియల్స్‌ను క్రమం తప్పకుండా చూసే శ్రీలతకు తెలుగు టీవీ ఆర్టిస్టులంటే వల్లమాలిన అభిమానం. అటుపై 2018లో ఓ టీవీ చానెల్ సీరియల్ లో ఊహించని విధంగా తన పేరును చూసుకుంది. `ప్రొడ్యూసర్- డైరెక్టర్: శ్రీదేవి తుమ్మల` అన్న టైటిల్ కార్డ్ తన కళ్లబడింది. ఇంకేం ఉంది వెంటనే మెరుపులాంటి ఐడియా బుర్రలోకి వచ్చేయడం దానిని అమలు చేసి అమాయకులకు వలలు వేయడం మొదలు పెట్టింది. ఈజీ మనీ కోసం ట్రాప్ వేసేందుకు శ్రీదేవి తుమ్మల డైరెక్టర్- ప్రొడ్యూసర్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఐడీని క్రియేట్ చేసింది. దాని ద్వారా ఫాలోవర్స్ పెరిగారు. ఆ క్రమంలోనే టీవీ- మూవీ ఆర్టిస్ట్‌లు కావాలనుకునేవారిని ఫేస్ బుక్ ద్వారా టోకరా వేయడం మొదలు పెట్టింది.
సీరియల్స్ లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ డబ్బులు దండుకొని విలాస జీవితానికి అలవాటుపడిన శ్రీలత టీవీ ఆర్టిస్టులు నిషామా- శిరీష- కరుణ సహా పలువురు నటీనటులకు ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ లు పంపి నిజమైన ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మలగా రోజువారీ చాటింగ్ చేసేది. ఎవరైనా ఫేస్ బుక్ ద్వారా సంప్రదిస్తే చాలు సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులు డిపాజిట్ చేయమని అలా చాలా పెద్ద మొత్తంలో దండుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలతను అరెస్ట్ చేసిన పోలీసులు ఆవిడగారి మోసాల చిట్టా జాబితాని పరిశీలిస్తున్నారట.