Begin typing your search above and press return to search.
గుండెపోటుతో నటుడు చలపతిరావు హఠాన్మరణం
By: Tupaki Desk | 25 Dec 2022 2:54 AM GMTటాలీవుడ్ లో వరుస విషాదాలు కలచివేస్తున్నాయి. నిన్నగాక మొన్న(23 డిసెంబర్) వెటరన్ నటుడు నవరసనటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణ వార్త విని అభిమాన లోకం దిగ్భ్రాంతికి గురైంది. ఇంతలోనే ఈరోజు మరో దుర్వార్త వినాల్సి వచ్చింది. మరో సీనియర్ నటుడు చలపతిరావు(79) శనివారం రాత్రి గుండెపోటు తో మరణించారు.
ఆయన పార్థివదేహాన్ని MLA కాలనీ లోని తన కుమారుడు.. దర్శకుడు రవి బాబు ఇంటి వద్ద ఉంచారు. మధ్యాహ్నం 3 గంటలకు మహా ప్రస్థానంకు తరలించి ఫ్రీజర్ లో ఉంచుతారని కుటుంబీకుల నుంచి సమాచారం. అమెరికాలో ఉంటున్న చలపతిరావు కుమార్తె రాగానే బుధవారం మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుపుతారు.
సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతి రావు వయసు 79. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే కాలనీ ( బంజారాహిల్స్)లో తన కుమారుడు రవి బాబు ఇంట్లో నివశిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని రవి బాబు ఇంట్లో నే అభిమానుల సందర్శన కోసం ఉంచుతారు.
విలనీతో పాటు అద్భుత హాస్యాన్ని పండించగల చతురుడు చలపతిరావు. దాదాపు 600కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించిన చలపతిరావు 90లలో విలన్ గా రాణించారు. ఇటీవల పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఎన్నో సహాయక పాత్రలతోను మెప్పించారు. అన్నగారు ఎన్టీఆర్ అండదండలతో ఆయన పరిశ్రమలో నటుడిగా ఎదిగారు. చలపతిరావు స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ .. కృష్ణా జిల్లాలోని బలిపర్రు. ఆయన కుమారుడు రవిబాబు టాలీవుడ్ లో నటుడు దర్శకుడు- నిర్మాతగా కొనసాగుతుననారు.