Begin typing your search above and press return to search.

ఆహా తెలుగందం.. సొగసరి చందం!

By:  Tupaki Desk   |   19 May 2020 10:50 AM GMT
ఆహా తెలుగందం.. సొగసరి చందం!
X
శోభితా ధూళిపాల.. ఈ తెలుగు అమ్మడు హీరోయిన్ గా హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది. మొదటగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0'లో నటించింది. ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండి' మొదలగు హిందీ సినిమాలు చేసింది. తెలుగు అమ్మాయి అయినా.. అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' సినిమాతో ఆలస్యంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక గూఢచారి సినిమా సూపర్ హిట్ అయినా కూడా శోభితాకు మాత్రం తెలుగులో సరైన అవకాశాలు ఇంతవరకు రాలేదు. అయితే ప్రస్తుతం శోభితా పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ.. అడపా దడపా సినిమాలు చేస్తూ బీజీగా ఉండటానికి ట్రై చేస్తుంది. 2013 ఫెమినా మిస్‌ ఇండియా కాంపిటీషన్‌లో రన్నరప్‌గా నిలిచిన శోభిత తరువాత భారతీయ సూపర్ మోడల్.. అందాల పోటీ టైటిల్స్ విన్నర్ గా నిలిచింది. అనంతరం ఈ భామ మిస్ ఎర్త్ ఇండియా 2013 టైటిల్ గెలుచుకుని.. 2013 మిస్ ఎర్త్ పోటీలకు ఫిలిప్పీన్స్ లో ఇండియాకి ప్రాతినిధ్యం వహించింది.

ఆ సమయంలో శోభిత.. మిస్ ఫోటోజెనిక్, మిస్ ఎకో బ్యూటీ, మిస్ టాలెంట్ మొదలైన టైటిల్స్ సొంతం చేసుకుని తన సత్తా చాటింది. కానీ ఇప్పటికి సిల్వర్ స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. ఇక అమ్మడు పలు బ్రాండ్‌లకు ప్రమోటర్‌గా ఉంటూనే.. కొన్ని మ్యాగజైన్‌ కవర్ ఫేజ్‌ల మీద సందడి చేస్తుంది. 2014 సంవత్సరానికి గాను కింగ్ ఫిషర్ స్విమ్సూట్ క్యాలెండర్ ఆసియాలో ఎక్కువగా వీక్షించిన ముద్రణ ప్రచారాలలో ఒకటి. అందులో తళుక్కుమని మెరిసింది అమ్మడు. ఇక శోభితా ధూళిపాల పుట్టింది పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో.. కానీ అమ్మడు తన ఫాషన్ కోసం ముంబైలో స్థిర పడింది. అక్కడే ఉంటూ అవకాశాల కోసం ట్రై చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టీవ్ గా ఉండే శోభిత.. అదిరిపోయే ఫోటో షూట్లతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందాల భామ అందాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో అమ్మడు స్టైల్ గా జుట్టు సవరించుకుంటూ తన సొగసైన సోయగాలను టాప్ టు బోటం ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.