Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లేడీ గూఢచారి క‌ళ్ల‌లోనే మైకం

By:  Tupaki Desk   |   16 Aug 2020 6:10 AM
ఫోటో స్టోరి: లేడీ గూఢచారి క‌ళ్ల‌లోనే మైకం
X
క‌ళ్ల‌లోనే ఉంది మైకం ఏదో.. త‌నువులోనే ఉంది త‌మ‌కం ఇదిగో! .. తెలుగ‌మ్మాయి శోభిత ధూళిపాల ట్యాలెంట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. గూఢ‌చారి చిత్రంలో జేమ్స్ బాండ్ 007 సీక్రెట్ ఏజెంట్ లా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇండియ‌న్ ఏజెంట్ శేష్‌ సీక్రెట్స్ క‌నిపెట్టేందుకు వ‌చ్చి ప్రేమ‌లో ప‌డే భామ‌గా శోభిత న‌ట‌న‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది.

గూఢ‌చారి త‌ర్వాత తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చినా ఎంతో సెల‌క్టివ్ గా ఉంటున్న ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం హిందీ ప‌రిశ్ర‌మపైనే ఎక్కువ‌గా దృష్టి సారిస్తోంది. శోభిత హిందీ వెబ్ సిరీస్ `ఘోస్ట్ స్టోరీస్` లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస ఫోటోషూట్ల‌తో మేక‌ర్స్ కి ఫీల‌ర్స్ వ‌దులుతోంది.

శోభిత లేటెస్ట్ లుక్ సెన్సేష‌న్ అనే చెప్పాలి. కోరికతో కాలుతున్న కొంటె కోనంగి లుక్ తో బోయ్స్ ని ఇట్టే బుట్ట‌లో వేసేస్తోంది. అన్న‌ట్టు మ‌ణిర‌త్నం సినిమాలో న‌టిస్తోంద‌ని.. గూఢ‌చారి ఫేం శేష్ అడివితో మేజ‌ర్ చిత్రంలో క‌నిపించ‌బోతోంద‌ని టాక్ వినిపించింది. ఇవ‌న్నీ క‌న్ఫామ్ అయితే ఈపాటికే శోభిత‌నే ఆ సంగతిని సోష‌ల్ మీడియాల్లో వెల్ల‌డించేది. కానీ ఇంకా అధికారికంగా త‌న నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. తెనాల‌మ్మాయ్ గా శోభిత ఇప్ప‌టికే తెలుగు లోగిళ్ల‌కు తెలుసు కాబ‌ట్టి ఈ అమ్మ‌డి కెరీర్ గురించి మ‌న యూత్ లో ఆస‌క్తి నెల‌కొంది. త‌దుపరి ప్రాజెక్టుల‌పై మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంది.