Begin typing your search above and press return to search.

తమిళ వెర్షన్ ను మనోళ్లు వదిలిపెట్టట్లేదు

By:  Tupaki Desk   |   20 Oct 2017 4:24 AM GMT
తమిళ వెర్షన్ ను మనోళ్లు వదిలిపెట్టట్లేదు
X
అనివార్య కారణాల వలన 'మెర్సాల్‌' తెలుగు వర్షన్ తెలుగులో రిలీజ్ కాలేదు. విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమాను రాజా రాణి ఫేం అట్లీ రూపొందించాడు. అయితే ఈ సినిమాకు తమిళంలో బ్లాక్ బస్టర్ అని టాక్ రాకపోయినా కూడా.. విజయ్ ట్రిపుల్ యాక్షన్ ఇందులో పెద్ద ట్రీట్. కాని తెలుగు వర్షన్ మాత్రం ఇంకా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోకపోవడంతో.. అలాగే మరేదో కారణం చేత 'అదిరింది' అంటూ మన ఆడియన్స్ ను పలకరించలేదు.

విషయం ఏంటంటే.. అసలు తెలుగు వర్షన్ ను చూద్దాం అనుకున్న తెలుగు అభిమానులు ఉన్నారే.. వారిని క్యాష్‌ చేసుకోవాలని భలే ప్లాన్ వేశాయి మన మల్టీప్లెక్సులు. ఇంకేముంది.. వెంటనే వారు తెలుగు వర్షన్ 'అదిరింది' కోసం కేటాయించిన స్ర్కీన్లను తమిళ వర్షన్ 'మెర్సాల్'తో నింపేశారు. దానితో బాష అర్ధంకాకపోయినా కూడా చాలామంది తెలుగు ప్రేక్షకులు ధియేటర్లకు క్యూ కట్టేశారు. అసలు దీపావళి రోజున కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ అయ్యిదంటే.. దానర్ధం ఇక్కడున్న తమిళులు అందరూ సినిమాకు వెళ్ళారని కాదండోయ్.. మనోళ్ళు తమిళ వర్షన్ ను కూడా వదిలిపెట్టకుండా చూసేయడమే.

ఏదేమైనా కూడా ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలంటే ఇండియాలో బౌండరీలు లేకుండా పోతున్నాయి. నిన్న మొన్నాకేవలం విజయ్ మెర్సాల్ సినిమానే కాదు.. అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్ .. అజయ్ దేవగన్ గోల్ మాల్ రిటర్న్స్ సినిమాలను కూడా అలాగే చూశారు మనోళ్ళు. అభిమానం అండీ!!!