Begin typing your search above and press return to search.

సీతారామం హిందీ రిలీజ్ తో తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి

By:  Tupaki Desk   |   5 Sep 2022 5:07 AM GMT
సీతారామం హిందీ రిలీజ్ తో తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి
X
తెలుగు బాక్సాఫీస్ వద్ద కు సీతారామం సినిమా వచ్చి నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ నెల రోజుల పాటు బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా సందడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మొదటి రెండు మూడు వారాల పాటు సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా హిందీ లో కూడా విడుదల అయ్యింది.

ఇటీవలే హిందీలో విడుదల అయిన సీతారామం సినిమా తెలుగు ప్రేక్షకుల అసంతృప్తికి కారణం అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే సీతారామం సినిమా ను థియేటర్లలో భారీ ఎత్తున ప్రేక్షకులు చూశారు. అయినా కూడా ఓటీటీ లో చూడటం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

సీతారామం సినిమాను థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ అయిన అయిదు వారాల తర్వాత స్ట్రీమింగ్ కి అమెజాన్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ లెక్కన ఈ వారంలోనే అమెజాన్ లో సీతారామం సినిమా స్ట్రీమింగ్‌ అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అమెజాన్ నుండి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు.

కనీసం వారం ముందు నుండే స్ట్రీమింగ్‌ కు సంబంధించిన ప్రకటనను అమెజాన్ ప్రైమ్‌ సోషల్‌ మీడియా ద్వారా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అమెజాన్ ఆ ప్రకటన చేయకపోవడంతో ఇప్పుడు అంతా మరో రెండు మూడు వారాల వరకు స్ట్రీమింగ్ కోసం వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు.

అందుకు కారణం.. ఇటీవలే సీతారామం సినిమా హిందీ వర్షన్‌ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి వసూళ్లను నమోదు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే ఈ సినిమా కు సంబంధించిన స్ట్రీమింగ్ ను అమెజాన్ తో నిర్మాణ సంస్థ వాయిదా వేయించి ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. అందుకే హిందీలో సీతారామం విడుదల అవ్వడం పట్ల తెలుగు ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా పడితే ప్రేక్షకులు యూనిట్‌ సభ్యులపై సోషల్‌ మీడియా ద్వారా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ముందు ముందు సినిమాలు విడుదల అయిన తర్వాత ఎనిమిది వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయకూడదు అంటూ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. కానీ సీతారామం కి ఆ కండీషన్ వర్తించదు. అయినా కూడా ఎనిమిది వారాల వరకు ఈ సినిమా రాదా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.