Begin typing your search above and press return to search.
అఫిసియల్: సెప్టెంబర్ 5న తెలుగు 'బిగ్ బాస్ 5' ప్రారంభం..!
By: Tupaki Desk | 26 Aug 2021 7:30 AM GMTబుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా సంచలనం సృష్టించిన 'బిగ్ బాస్'.. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్-5 లో అడుగుపెడుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా 'బిగ్ బాస్-5' షో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోందని అధికారికంగా ప్రకటించారు.
'బిగ్ బాస్ తెలుగు' సీజన్-5 ప్రారంభ కార్యక్రమం వచ్చే నెల 5న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ అయ్యే ఈ రియాలిటీ షో.. శని ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకే మొదలవుతుంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన 'స్టార్ మా' టీమ్.. ''బిగ్ బాస్ 5'' ను ప్రసారం చేయనుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో కూడా ఈ తెలుగు రియాలిటీ షో అందుబాటులో ఉంటుంది.
ఇకపోతే 'బిగ్ బాస్' హోస్టుగా మరోసారి కింగ్ అక్కినేని నాగార్జున సందడి చేయనున్నారు. అనేకమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. గత మూడు సీజన్లని విజయవంతంగా నడిపించి అత్యధిక టీఆర్పీ రావడానికి కారణమైన నాగ్ నే ఐదో సీజన్ కు వ్యాఖ్యాతగా నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన 'బిగ్ బాస్ 5' ప్రోమోలో 'చెప్పండి బోర్ డమ్ కి గుడ్ బై.. వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ 5' అంటూ స్టైలిష్ నాగార్జున తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.
అలానే 'బిగ్ బాస్ తెలుగు' షోలో పాల్గొనే కంటెస్టంట్ లను ఇప్పటికే ఫైనల్ చేశారు. సెలెక్ట్ చేయబడిన వారిని క్వారెంటైన్ లో ఉంచారు. 15 రోజుల క్వారెంటైన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు అందరూ 'బిగ్ బాస్ 5' హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హౌస్ మేట్స్ అందరికీ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారు. 'బిగ్ బాస్ 5' లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్లు అంటూ అనేకమంది పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఎవరెవరు సందడి చేస్తారనేది మరో పది రోజుల్లో వెళ్లడవుతుంది.
ఏదేమైనా హాలీవుడ్ లో పుట్టిన 'బిగ్ బాస్' కాన్సెప్ట్.. అక్కడి నుంచి బాలీవుడ్ కు అనంతరం దక్షిణాదిన అడుగు పెట్టి బుల్లితెర ప్రేక్షకులకు అసలైన మజాని పరిచయం చేసిందని చెప్పవచ్చు. ఇప్పుడు తెలుగులో రాబోతున్న 'బిగ్ బాస్ 5'.. నాగార్జున హోస్టింగ్ లో స్మాల్ స్క్రీన్ పై ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.