Begin typing your search above and press return to search.
తెలుగోళ్ల తమిళ సినిమా.. ప్రకంపనలే
By: Tupaki Desk | 3 Sep 2015 4:54 PM GMTఎడిటర్ మోహన్.. పక్కా తెలుగువాడని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చాలా సినిమాలకు ఎడిటర్ గా పనిచేయడమే కాక.. కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు. ఐతే చెన్నైలో సెటిలైపోయాక అతడి కొడుకులిద్దరూ తమిళ సినిమానే నమ్ముకున్నారు. పెద్ద కొడుకు రాజా దర్శకుడిగా మారగా.. చిన్న కొడుకు రవి హీరో అయ్యాడు. వీళ్లిద్దరూ 'జయం' సినిమాను రీమేక్ చేసి బంపర్ హిట్టు కొట్టారు. ఆ తర్వాత కూడా అనేక తెలుగు సినిమాల్ని అన్నదమ్ములిద్దరూ కలిసి రీమేక్ చేసి విజయాలందుకున్నారు. ఐతే గత కొంత కాలంగా వీళ్లిద్దరి పరిస్థితి ఏమంత బాగా లేదు. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఫ్లాపయ్యాయి. రవి వేరే దర్శకులతో చేసిన సినిమాలు కూడా ఆడలేదు. గత రెండు నెలల్లో అతడి సినిమాలు రెండు రిలీజయ్యాయి. ఒక్కటీ నిలబడలేదు.
ఐతే జయం రవి హీరోగా రాజా రూపొందించిన 'తనీ ఒరువన్' పోయిన శుక్రవారమే విడుదలైంది. ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నవాళ్లు కావడంతో ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. ఐతే విడుదల తర్వాత ఈ సినిమా ప్రకంపనలు రేపుతోంది. పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా.. సినిమాకు మంచి రివ్యూలు రావడం, ప్రేక్షకుల మౌత్ పబ్లిసటీ కూడా తోడవడంతో సినిమా రేంజే మారిపోయింది. ఇప్పుడందరూ బ్లాక్ బస్టర్ అంటున్నారు. వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో దుమ్ముదులుపుతోంది. రీమేక్ దర్శకుడిగా ముద్ర వేయించుకున్న రాజా.. ఈ సినిమాతో తన ఒరిజినల్ టాలెంట్ ఏంటో చూపించాడు. రవి కూడా ఓ రేంజిలో పెర్ఫామ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. విలన్ గా చేసిన అరవింద్ స్వామి అయితే కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాడు. నయనతార ఇందులో హీరోయిన్ గా నటించి. ఒక నిజాయితీ గల పోలీస్, క్రూరుడైన డాన్ కు మధ్య సాగే పోరాటమే ఈ సినిమా. ఘర్షణ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ అన్నమాట. ఈ సినిమా రీమేక్ కోసం అప్పుడే వేర్వేరు భాషల నుంచి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తుండటం విశేషం. తెలుగులోకి ఈ సినిమా రీమేకవుతుందా.. డబ్ అవుతుందా చూడాలి.