Begin typing your search above and press return to search.
తెలుగు ఛానెళ్లు తప్పులో కాలేశాయా?
By: Tupaki Desk | 11 July 2015 11:11 AM GMTటాలీవుడ్‌లో ఏడాది ముందు వరకు శాటిలైట్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఉండేది. సినిమా నిర్మాణంలో ఉండగానే నిర్మాతకు ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసి శాటిలైట్ రైట్స్ తీసేసుకునేవి ఛానెళ్లు. ఐతే భారీ ధర పెట్టి కొన్న కొన్ని సినిమాలకు టీవీల్లో సరైన రేటింగ్ రాకపోవడంతో ఛానెళ్లు దెబ్బయిపోయాయి. పెద్ద సినిమాల విషయంలో కూడా కొంచెం పోటీ తగ్గింది. సినిమా విడుదలయ్యాక రెస్పాన్స్‌ను బట్టి కొనడం మేలన్న అభిప్రాయానికి వచ్చేయడంతో పెద్ద సినిమాలకు కూడా పోటీ తగ్గింది. బాహుబలి విషయంలో ఎంత పోటీ ఉందో ఏమో కానీ.. నిర్మాతలు చెప్పిన రేటుకు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.
ఐతే ఇప్పుడు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం శాటిలైట్ రైట్స్ ధర ఆకాశానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా శ్రీమంతుడు సినిమాదే శాటిలైట్ రైట్స్ విషయంలో రికార్డు. ఈ మధ్యే ఆ సినిమా రూ.11 కోట్లు పలికినట్లు వార్తలొచ్చాయి. మరి ఆ సినిమాకే అంతుంటే బాహుబలికి ఇంకో ఏడెనిమిది కోట్లు ఎక్కువే పెట్టాల్సిందే. పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి.. బాహుబలి రైట్స్ రూ.20 కోట్లు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదంటే రెండు పార్ట్‌లకు కలిపి టోకుగా రూ.30-35 కోట్ల మధ్య ఏ ఛానలైనా రైట్స్ తీసేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బాహుబలి సినిమా విడుదలకు ముందే బేరమాడుకుని ఉంటే ఫస్ట్ పార్ట్ రూ.15 కోట్లకు సొంతమై ఉండేదేమో. ఈ విషయంలో మన ఛానెళ్లు తప్పులో కాలేసినట్లే!