Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో కొత్త భయాలు

By:  Tupaki Desk   |   28 Oct 2018 6:36 AM GMT
ఓవర్సీస్ లో కొత్త భయాలు
X
టాలీవుడ్ పరిధి విస్తృతమయ్యాక అందరి కన్ను యుఎస్ మార్కెట్ మీదే ఉంటోంది. కొందరైతే తమ కథలను కూడా అక్కడి ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని మరీ రాస్తున్నారు. కాకపోతే సక్సెస్ అన్నింటికీ గ్యారెంటీ ఉండదు కాబట్టి కొన్ని మాత్రమే బయ్యర్లకు లాభాలు ఇవ్వగలుగుతున్నాయి. కానీ ఇటీవలి కాలంలో భారీ సినిమాల వ్యాపారం జూదంలా మారిపోవడంతో ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవలే వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ రేంజ్ ఎంత అనేది పక్కన పెడితే ఓవర్సీస్ లో మాత్రం ఇది నష్టాలే మిగిల్చింది.

రెండు మిలియన్ మార్కు అందుకున్నప్పటికీ క్రేజీ కాంబో దృష్ట్యా అధిక రేట్ కు దీన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్ కు కనీసం బ్రేక్ ఈవెన్ కూడా ఇవ్వలేకపోయింది. మరో అర మిలియన్ దాకా వస్తేనే తప్ప ప్రాఫిటబుల్ వెంచర్ అనలేని ఈ సినిమా ఇప్పటికే నెమ్మదించింది కానీ ఏదైనా ఆశించడం కూడా కష్టమే. మరోవైపు అజ్ఞాతవాసి నా పేరు సూర్య దాకా విపరీతమైన సినిమాల లిస్ట్ పెద్దదిగానే ఉంది.

ఇప్పుడు దీని ప్రభావం రానున్న వాటి మీద ఉండే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా వచ్చే ఏడాది హైప్ పీక్స్ లో ఉన్న మహర్షి-సైరా-సాహో ల మీద ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా. ఇందులో ఇతర బాషల హక్కులు శాటిలైట్ లాంటివి కలపకుండానే ఇంత లెక్క తేలింది. ఇందులో యుఎస్ మార్కెట్ చాలా కీలక పాత్ర పోషించనుంది. వీటి బడ్జెట్ దృష్ట్యా ఇప్పుడున్న రేట్ల కంటే కనీసం మూడు నుంచి నాలుగింతలు ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

మరి అంత రిస్క్ తీసుకుని ముందుకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ మీద సైతం ఎక్కువ రేట్లను ఆశించడం మరో ట్విస్ట్. అలా అని అసలు లాభాలే ఇవ్వని సినిమాలు లేవని కాదు. రంగస్థలం-మహానటి-భరత్ అనే నేను కొన్నవాళ్లను సంతోషంలో ముంచెత్తినవే. మరి ఇదే నమ్మకంతో అక్కడి పెట్టుబడిదారులు ట్రెండ్ ని కంటిన్యూ చేస్తారా లేక తాజా చేదు అనుభవాల దృష్ట్యా ఏదైనా కొత్త స్ట్రాటజీతో ముందుకు వస్తారా వేచి చూడాలి.