Begin typing your search above and press return to search.
ఇక అక్కడిదే అసలైన టాక్ అన్నమాట
By: Tupaki Desk | 20 Jan 2016 10:30 PM GMTతెలుగు ప్రజలు ఆ వారం విడుదలవుతున్న తెలుగు సినిమాల గురించి తెలుసుకోవాలంటే మౌత్ టాక్ లు, పబ్లిసిటీ స్టంట్ లు, సినిమా రివ్యూలు చూసుకుని థియేటర్ లవైపు అడుగేస్తారు. అయితే వీటిలో ఏదోక దానిలో అడపాదడపా మోసపోతూ వస్తున్న సగటు ప్రేక్షకుడికి సినిమా రిజల్ట్ పై రిలేయబుల్ సోర్స్ కనిపించడంలేదు. కట్ చేస్తే ఇప్పుడు దానికో మార్గం తోచినట్టు కనిపిస్తుంది.
విదేశాలలో వుండే ప్రవాసాంధ్రులు తెలుగు సినిమాలపై మక్కువ బాగానే చూపిస్తారు. అలాగని ఏ సినిమాను పడితే ఆ చిత్రాన్ని చుసేయడానికి వాళ్ళ టిక్కెట్ 80 - 150 కి దొరకదు. అందుకే ఆచి తూచి చిత్రాలను ఎంపిక చేసుకుంటారు. ఇలా ఎంపిక చేసుకుని ఆదరణ పొందిన చిత్రాలు ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా సూపర్ హిట్లుగా నిలిచినవే.
గతకొన్ని నెలలుగా శ్రీమంతుడు - భలే భలే మగాడివోయ్ - నేను శైలజ - నాన్నకు ప్రేమతో ఇలా ఓవర్ సీస్ లో సూపర్బ్ అనిపించిన సినిమాలన్నీ ఇక్కడ కూడా సూపర్ హిట్టే. అయితే ఇక్కడ ఒక వర్గం వారినే ఆకర్షించి హిట్ అయిన రాజు గారి గది - భలే మంచి రోజు - డిక్టేటర్ వంటి సినిమాల పప్పులు అక్కడ వుడకలేదు. దీనిబట్టి చూస్తే ఓవర్ సీస్ కలెక్షన్లను, స్టేటస్ లను చూసుకుని సినిమాపై తీర్పు చెప్పే రోజులు దగ్గరలోనే వున్నట్టు తెలుస్తుంది.