Begin typing your search above and press return to search.
మన ఎన్నారైలకు మామూలు పిచ్చి కాదు
By: Tupaki Desk | 3 Aug 2017 11:51 AM GMTఅమెరికాలోని ఉన్న ఎన్నారైలందు తెలుగు ఎన్నారైలు వేరయా. ఈ మాటకు ద్వంద్వార్ధాలూ గట్రా ఏమీ లేవు. మనోళ్లు వేరంటే వేరు అంతే. ఎందుకంటే ఇప్పుడు మన ఎన్నారైలకు సినిమాలు చూడటం అంటే ఎంత ఇష్టమో అసలు అమెరికాలో ఇండియన్ సినిమాలు వసూలు చేస్తున్న వసూళ్లను చూస్తే అర్ధమవుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన వసూళ్ళు చూసుకుంటే.. మనోళ్ళకు సినిమాలంటే ఎంతిష్టమో.. అలాగే పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు కూడా మన సినిమాలతో ఎలా పోటీపడలేవో అర్ధమైపోతోంది.
ఈ ఏడాదికి బాహుబలి 2 ఒక్కటే అత్యంత భారీగా వసూలు చేసిన సినిమా. అమెరికన్ మార్కెట్ లో ఈ మూవీ 20+ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ తరువాత చూసుకుంటే అసలు ఓవర్సీస్ కింగ్ గా పేరొందిన షారూఖ్ సినిమా రయీస్ 3.6 మిలియన్ డాలర్లను తెచ్చిపెట్టింది. ఆ తరువాత 3వ పొజిషన్లో ఖైదీ నెం 150 సినిమా 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. బద్రినాథ్ కి దుల్హనియా 1.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఫిదా సినిమా ఆల్రెడీ 1.7+ మిలియన్లు వసూలు చేసింది కాబట్టి.. 2 మిలియన్ డాలర్లు టచ్ చేయడం సులభం అంటున్నారు. అలాగే చేస్తే 4వ పొజిషన్లో తెలుగు సినిమానే ఉంటుంది.
తెలుగు సినిమాల సత్తా అటుంచితే.. బాలీవుడ్ లో పెద్ద పెద్ద హిట్లుగా ఈ ఏడాది నానా హంగామా చేసిన జాలీ ఎల్ ఎల్ బి సినిమా 1.6 మిలియన్ డాలర్లు.. కాబిల్ సినిమా 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేసశాయి. మధ్యలో ట్యుబులైట్ సినిమా 1.5 మిలియన్లు వసూలు చేసింది. ఆ లెక్కన చూస్తుంటే తెలుగు సినిమాలనే ఎన్నారైలు ఎక్కువగా చూస్తున్నారు అనుకోవాలి. లేదు లేదు.. తెలుగు ఎన్నారైలే సినిమాలు ఎక్కువగా చూస్తారని చెప్పుకోవాలి.