Begin typing your search above and press return to search.
ఓపెనింగ్ తేడా కొట్టింది!!
By: Tupaki Desk | 8 Oct 2018 7:19 AM GMTసెప్టెంబర్ లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కొత్త సినిమాల సందడి ఉన్నా గర్వంగా నిలిచిన బ్లాక్ బస్టర్ ఒక్కటీ లేకపోవడం అటు ట్రేడ్ ని ఇటు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. జయాపజయాలు సహజం కాబట్టి అక్టోబర్ ఈ లెక్కలన్నీ సరిచేస్తుందనే నమ్మకంతో ఎదురు చూపులు మొదలయ్యాయి. కానీ మొదటివారం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన విజయ్ దేవరకొండ నోటా పరాజయం వైపుగా పరుగులు పెట్టడం అభిమానులనే కాదు ఇటు బయ్యర్లకు షాక్ ఇచ్చింది. క్రేజ్ వల్ల మొదటి రెండు రోజులు ఢోకా లేకపోయినా మూడో రోజు అందులోనూ ఆదివారం డ్రాప్ కనిపించడం ఆందోళన కలిగించే విషయమే.
ఇప్పటి దాకా సుమారు 8 కోట్ల 25 లక్షల దాకా డిస్ట్రిబ్యూటర్ షేర్ ఇచ్చిన నోటా ఇవాళ్టి నుంచి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. అరవింద సమేత వీర రాఘవ రావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉన్నా దాన్ని క్యాష్ చేసుకునేలా నోటా కనిపించడం లేదు. యావరేజ్ గా ఉందన్నా తన బ్రాండ్ మీద విజయ్ దేవరకొండ లాగించేవాడు కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు దర్శకుడు ఆనంద్ శంకర్. ఇక దేశంలో దొంగలు పడ్డారుతో పాటు భలే మంచి చౌక బేరము విడుదలయ్యాయి కానీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. రిపోర్ట్స్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో హైదరాబాద్ లాంటి నగరాల్లోనే చాలా చోట్ల రెండు మూడు షోలకే పరిమితమవుతున్నాయి. కొద్దోగొప్పో హాలీవుడ్ మూవీ వెనోమ్ కు మంచి ఓపెనింగ్స్ రావడం అసలు ట్విస్ట్.
దేవదాస్ విషయానికి వస్తే ఇప్పటి దాకా 20 కోట్ల షేర్ అందుకోవడానికి నానా తంటాలు పడిన ఈ మల్టీ స్టారర్ ఇంకా బాలన్స్ ఉన్న 15 కోట్లు రీచ్ కావడం అసాధ్యమే. వీక్ ఎండ్ లో ఓకే అనిపిస్తున్నా మిగిలిన రోజుల్లో మాత్రం దేవదాస్ రన్ ఏ మాత్రం మెరుగ్గా లేదు. మణిరత్నం నవాబ్ నాలుగో రోజు నుంచే సింగల్ డిజిట్ లోకి పడిపోయి డిజాస్టర్ గా మిగిలింది. విచిత్రంగా ఇంకా కొన్ని మెయిన్ సెంటర్స్ లో గీత గోవిందం డీసెంట్ నెంబర్స్ నమోదు చేయడం గమనార్హం. గురువారం రాబోతున్న అరవింద సమేత వీర రాఘవ ఈ లెక్కలన్నీ సరిచేయాలనే నమ్మకంతో ఎదురుచూస్తోంది టాలీవుడ్.