Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ లో నీరసపడిన టాలీవుడ్
By: Tupaki Desk | 28 Feb 2019 6:33 AM GMTకొత్త ఏడాది అందులో సంక్రాంతికి ఒకటి కాదు ఏకంగా మూడు క్రేజీ తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఒకటి సూపర్ స్టార్ డబ్బింగ్ మూవీ ఇంకేముంది పండగే పండగ అనుకున్నారు ప్రేక్షకులు. దానికి తగ్గట్టే ఓవర్సీస్ బయ్యర్లు కూడా టికెట్ కౌంటర్లు కళకళలాడి మిలియన్ల వర్షం కురుస్తుందని ఆశగా ఎదురు చూసారు. కానీ జరిగింది వేరు. అంచనాలు తలకిందులయ్యాయి. ఎన్టీఆర్ కథానాయకుడుతో మొదలైన పరాజయాల ప్రవాహం మహానాయకుడు దాకా కొనసాగుతూనే ఉంది.
ఒక్క ఎఫ్2 మాత్రమే అంచనాలను మించి పెర్ఫార్మ్ చేసి దేశీయంగా 80 కోట్ల షేర్ పైగా రాబట్టి యుఎస్ లోనూ సగర్వంగా 2 మిలియన్ మార్క్ ని దాటేసింది. ఒకదశలో మూడు మిలియన్ చేరుకుంటుంది అన్న అంచనాలు ఉన్నాయి కానీ ఎందుకో టచ్ చేయలేక రిటర్న్ అయ్యింది. ఎన్టీఆర్ కథానాయకుడు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అది వసూళ్లుగా మారలేదు. వినయ విధేయ రామ పేరు తల్చుకుంటేనే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు.
తర్వాత ఓ రెండు వారాల గ్యాప్ తో వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అంచనాలు నిలబెట్టుకోలేకపోయింది. మిలియన్ మార్క్ చేరుకున్నా ఫ్యాన్స్ సంతోషించే వారు కానీ వీక్ గా ఉన్న కంటెంట్ కి ఆ అర్హత లేదని తేల్చేశారు. యాత్ర టాక్ తో పాటు రివ్యూస్ బాగానే వచ్చినప్పటికి అద్భుతాలు చేయలేకపోయింది కానీ వసూళ్లు ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించాయి.
మహానాయకుడు గురించి ఎక్కువ చెప్పుకోకపోవడం ఉత్తమం. ఇక్కడ ప్రస్తావించవన్నీ పెద్ద సినిమాలే. మధ్యలో వచ్చిన చిన్నవాటి గురించి చెప్పుకోలేదు. రెండు నెలల కాలంలో టాలీవుడ్ నుంచి ఇన్నేసి సినిమాలు వెళ్తే ఒక్కటి మాత్రమే అంచనాలు అందుకోవడం అంచనాలు కలిగించే విషయమే. రేపు మార్చ్ 1 కళ్యాణ్ రామ్ 118తోనైనా ఈ పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి