Begin typing your search above and press return to search.
ఏడాదిలోనే 'ఆహా' అనిపించుకున్న తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్..!
By: Tupaki Desk | 8 Feb 2021 4:30 PM GMTకరోనా లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయి. అప్పటికే హవా కొనసాగిస్తున్న నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్ వంటి ఓటీటీలకు పోటీగా అనేక కొత్త ఓటీటీలు - ఏటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే క్రమంలో 100 శాతం తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చింది రీజనల్ యాప్ 'ఆహా'. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ - మై హోమ్ గ్రూప్ రామ్ సారధ్యంలోని ఈ ఓటీటీ అనతికాలంలోనే మంచి ఆదరణ దక్కించుకుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అందిస్తూ ఓవర్ ది టాప్ అనిపించుకుంది. ఈ క్రమంలో సక్సెస్ ఫుల్ గా ఒక ఏడాది కాలం పూర్తి చేసుకుంది 'ఆహా'.
తెలుగు సినిమాలు - డబ్బింగ్ సినిమాలు - వెబ్ సిరీస్ లతో పాటు స్పెషల్ షో లను కూడా స్ట్రీమింగ్ కి పెడుతూ వీక్షకులను అలరిస్తూ వస్తోంది. 'భానుమతి అండ్ రామకృష్ణ' 'మా వింతగాథ వినుమా' 'కలర్ ఫొటో' 'ఒరేయ్ బుజ్జిగా' 'సూపర్ ఓవర్' 'క్రాక్' వంటి సినిమాలు.. 'మెయిల్' 'కమిట్ మెంటల్' వంటి వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తోంది. అలానే సమంత అక్కినేని హోస్టుగా 'సామ్ జామ్' టాక్ షో.. హర్ష చెముడుతో 'తమాషా' వంటి కార్యక్రమాలు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు కంటెంట్ విషయంలో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోకు పోటీగా నిలిచింది 'ఆహా'.
వాస్తవానికి ప్రాంతీయ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ గా 'ఆహా' వచ్చినప్పుడు ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. థియేటర్స్ మూతబడటం.. లోకల్ తెలుగు ఫీలింగ్.. చిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొట్టడం.. పలువురు స్టార్ల సపోర్ట్.. ఇలా అనేక అంశాలు 'ఆహా'ను తెలుగు ప్రేక్షకులకి దగ్గర చేసింది. అంతేకాకుండా 'ఆహా' ఏడాది సబ్స్క్రిప్షన్ అన్ని ఓటీటీల కంటే తక్కువ కావడంతో ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం తెలుగు ఓటీటీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రాంతీయ డిజిటల్ వేదికగా 'ఆహా' ఒక బ్లాక్ బస్టర్ సంవత్సరం పూర్తి చేసుకుంది. మరి రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరై 'ఆహా' అనిపించుకుంటుందేమో చూడాలి.