Begin typing your search above and press return to search.
తెలుగు సినిమాని కాదని డబ్బింగ్ మూవీకి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారా...?
By: Tupaki Desk | 23 Jun 2020 11:30 PM GMTకోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ 'చక్ర'. సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. విశాల్ సూపర్ హిట్ మూవీ 'అభిమన్యుడు' తరహాలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మరియు రెజీనా కసాండ్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ స్వయంగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. తెలుగు తమిళ్ భాషల్లో 'చక్ర' అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని థియేటర్స్ తెరిచిన వెంటనే రిలీజ్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయట. ఇలాంటి క్రైసిస్ టైమ్ లో ముందుగా తెలుగు సినిమాలకు అవకాశం ఇవ్వాల్సింది పోయి డబ్బింగ్ సినిమాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేలా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో ఆల్రేడీ 'చక్ర' రిలీజ్ కి సంబంధించిన ఫైల్ మూవ్ అవుతుందని సమాచారం. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి కొందరు డిస్ట్రీబ్యూటర్లు కూడా రెడీగా ఉన్నారట. తెలుగులో విశాల్ మార్కెట్ ఒకప్పుడు బాగుండేది. కానీ దాదాపు మూడేళ్ళ నుంచి విశాల్ కి తెలుగులో సరైన హిట్ లభించలేదు. ఇది ఆలోచించుకోకుండా ఇప్పుడు విశాల్ సినిమాను రిలీజ్ చేసి డబ్బులు చేసుకుందామని ఆ డిస్ట్రీబ్యూటర్స్ ఎలా అనుకుంటున్నారో అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇక 'చక్ర' విషయానికొస్తే ఆల్రేడీ విశాల్ 'అభిమన్యుడు' సినిమా చేసేశాడు. సో దీనిపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అయినా థియేటర్లు తెరిచాక జనాల్ని ఆకట్టుకునే తెలుగు సినిమా రిలీజ్ చేయాలి కానీ ఇదేం పద్ధతి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్ని క్రైసిస్ లు వచ్చినా.. ఎన్ని దెబ్బలు తగిలినా.. ఎంత నష్టం జరుగుతునా టాలీవుడ్ ఇండస్ట్రీ వ్యవస్థ మారనే మారదని విమర్శలు చేస్తున్నారు.