Begin typing your search above and press return to search.
ఏపి లో మరో టాలీవుడ్.. ఎలాగంటే..
By: Tupaki Desk | 9 Aug 2017 3:38 AM GMTతెలుగు రాష్ట్రాల విభజన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయనే చెప్పాలి. ఇక ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం నాయకులు వారి స్థాయికి మించి కష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం చలనచిత్ర విభాగాల్లో కూడా కాస్త మార్పులు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. అలాగే కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది. అయితే కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కొత్త రాజధాని అమరావతిలో ఒక కొత్త తరహా ఫిల్మ్ చాంబర్స్ ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారట. అయితే ఈ తరహా వార్తలకు కొన్ని పుకార్లు కూడా వెంబడిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటె డ్రగ్స్ వ్యవహారం వల్ల ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందో అని ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ అవుతున్నారని ఓ వర్గం వారు గుసగుసలాడుకుంటున్నారట. కానీ అవన్నీ కేవలం అబద్ధాలని తెలుస్తోంది. వాళ్ళు షిఫ్ట్ అయ్యేది డ్రగ్స్ వలన కాదంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే షూటింగ్ లొకేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా చిన్న తరహా సినిమాలను తీసేవాళ్ళు ఏపీ లొకేషన్లలోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుతారు. దీంతో అక్కడ ప్రభుత్వం కూడా షూటింగ్ లను జరిపించుకోవడానికి సపోర్ట్ కూడా చేస్తోంది.
అంతే కాకుండా కొన్ని చిన్న తరహా మినీ ప్లెక్స్ లను నిర్మించి పంపిణీదారుల సహకారంతో కాకుండా డైరెక్ట్ గా సినిమాలను రిలీజ్ చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. దీంతో అనుకున్నట్టు జరిగితే ఏపీలో మరో కొత్త తరహా టాలీవుడ్ ఏర్పడినట్లే. బట్ ఇది ఎంతవరకు జరుగుతుంది? ప్రాక్టీకల్ గా ఉందా అనేదే అసలు ప్రశ్న!!