Begin typing your search above and press return to search.
బ్యాన్ చెయ్యరు.. బిగించేస్తారట
By: Tupaki Desk | 30 April 2018 5:01 PM GMTన్యూస్ ఛానల్స్ విషయంలో టాలీవుడ్ సినీ పరిశ్రమ ఓ ఐడియాకు వచ్చేసిందనే వార్త ఇప్పుడు తెగ వ్యాపించేస్తోంది. ముందు నుంచి వార్తలు వస్తున్నట్లుగానే.. న్యూస్ ఛానల్స్ విషయంలో కఠినంగానే ఉండాలని డిసైడ్ అయ్యారట సినిమా జనాలు. తమ ఇండస్ట్రీ ద్వారా కోట్ల రూపాయలను గడిస్తున్న ఛానళ్లు.. టీఆర్పీ రేటింగుల కోసం.. టాలీవుడ్ పై బురద చల్లే కార్యక్రమాన్ని పదే పదే చేస్తున్నారని అందుకే దాన్ని ఇండస్ట్రీ సీరియస్ గానే తీసుకుందని అనుకుంటున్నారు.
ఇకపై(మే 2 నుంచి అని టాక్) న్యూస్ ఛానల్స్ కు ఎవరూ ఎడ్వర్టెయిజ్మెంట్స్ ఇచ్చే సమస్యే లేదట. అలాగే ఎంటర్టెయిన్మెంట్ ఛానల్స్ కు ఇచ్చిన కంటెంట్ ను వాడుకున్నా.. కాపీరైట్ చర్యలు తీసుకుంటారట. ఈ విషయాలపై పబ్లిక్ తో కానీ.. ప్రెస్ మీట్లలో కానీ ఎవరు మాట్లాడాలనే అంశంపై కూడా ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఫిలిం ఛాంబర్ వర్గాలు.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతినిధులు.. మా అసోసియేషన్ సభ్యులతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులను ఎంపిక చేసుకున్నారట. వీరిలో ఓ 10 మంది మాత్రమే మీడియాతో టచ్ లో ఉంటారట.
కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే.. బ్యాన్ అనే మాటను ఎవరూ ఎక్కడా ఏ విధంగా ఉపయోగించే అవకాశమే లేదని తెలుస్తోంది. అలాగే టీవీ9 అండ్ ఎన్టీవీ విషయంలో కూడా ఇప్పటివరకూ ఉన్న ఎల్ ఎల్పీ(లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్ షిప్) ఒప్పందం కూడా రద్దు కానుందని తెలుస్తోంది. ఏ న్యూస్ ఛానల్ కు ఏ నిర్మాత కూడా ప్రకటన ఇచ్చే ఛాన్సే లేదని చెబుతున్నారు. నిర్ణయాలు ఇంత కఠినంగా ఉన్నా.. ఇది నిషేధం మాత్రం కాదని.. కేవలం తమకు తాము విధించుకున్న నియంత్రణ మాత్రమే అనే మాట టాలీవుడ్ లో వినిపిస్తుండడం హైలైట్.