Begin typing your search above and press return to search.

మీడియా అవసరమే.. అయినా క్లాసులే తప్పట్లే

By:  Tupaki Desk   |   30 April 2018 5:30 PM GMT
మీడియా అవసరమే.. అయినా క్లాసులే తప్పట్లే
X
ఎలాంటి ప్రచారం లేకుండా.. పబ్లిసిటీ కోసం పైసా ఖర్చు చేయకుండా బ్లాక్ బస్టర్లు సాధించేయడం.. బహుశా బాహుబలి లాంటి చిత్రాలకు తప్ప వేటికీ సాధ్యం కాదు. మిగిలిన పెద్ద చిన్న చిత్రాలు అన్నిటికీ ప్రమోషన్స్ అవసరమే. ఆ విషయంలో అటు సినిమా వాళ్లకు కూడా ఎలాంటి సందేహాలు లేవు. కానీ ఇప్పుడు మీడియా ప్రవర్తిస్తున్న తీరుపై మాత్రమే విమర్శలు వస్తున్నాయి.

మొదటగా పవన్ కళ్యాణ్ నేరుగా ఆయా ఛానల్స్ ను డైరెక్టుగానే విమర్శించాడు. ఇప్పుడు మహేష్ బాబు అటు తన సినిమలోను.. ఇటు డైరెక్టుగానే మీడియా తీరును ఖండించాడు. మంత్రి కేటీఆర్ కూడా తాము పడుతున్న ఇబ్బందులను సినిమాలో చూపించారని అన్నాడు. ఇప్పుడు నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ కూడా దాదాపు ఇదే మాట చెప్పాడు. అసలు మీడియా ఇలా ఎందుకు తయారయిపోయిందన్నదనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. నిజానికి కొందరు చేసిన తప్పులకు.. మొత్తం మీడియా అంతా చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తోంది.

సినిమా ఫీల్డ్ లో ఒకరిద్దరు చేసిన తప్పులకు ఇండస్ట్రీ అంతా మాట పడాల్సి వచ్చినట్లుగానే.. మీడియా పరిస్థితి కూడా తయారైంది. ఎవరో శుభోదయం సుబ్బారావులు చేసే పనులకు మీడియా మొత్తానికి మాట ఎదరవుతోంది. నిజానికి సినీరంగం- మీడియా రంగం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవే.. అందుకే మీరు హ్యాపీగా ఉండండి.. మమ్మల్ని హ్యాపీగా ఉంచండి అంటూ రామ్ చరణ్ కామెంట్ చేశాడు. మరి మీడియాలో ఉన్న ఆ కొందరు అర్ధం చేసుకుంటారా?