Begin typing your search above and press return to search.

సుమ.. నిన్ను మిస్సవుతున్నారమ్మా

By:  Tupaki Desk   |   22 Jun 2018 3:31 AM GMT
సుమ.. నిన్ను మిస్సవుతున్నారమ్మా
X
తెలుగు టీవీ రంగంలోనూ.. టాలీవుడ్ లోనూ ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కర్లేని పేరు సుమ. అందమైన చిరునవ్వు.. చక్కటి పలకరింపు... హుందాగా ఉండే మాటతీరు... తప్పుల్లేకుండా మాట్లాడే టాలెంట్ ఇవన్నీ సుమ సొంతం. పేరుకు మళయాళీ అమ్మాయి అయినా ఆమెను చూస్తే అసలు ఆ భావనే కలగదు. అందుకే యాంకరింగ్ రంగంలో సుదీర్ఘ కాలంపాటు సుమ టాప్ పొజిషన్ లో కంటిన్యూ అవుతూ వస్తోంది.

టీవీ షోల్లోనే కాకుండా టాలీవుడ్ కు సంబంధించి పబ్లిక్ ఈవెంట్లు కూడా సుమ లెక్కకు మిక్కిలిగా బోలెడు చేసింది. ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి తొట్రుపాటు లేకుండా ఈవెంట్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఈమధ్య సుమ వ్యక్తిగత సమస్యలతో ఈవెంట్లకు హాజరు కావడం లేదు. దీంతో చాలామంది కొత్త యాంకర్లు స్టేజ్ ఎక్కుతున్నారు. కానీ వీళ్లేమో దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా కాస్త అతి చేస్తూ వస్తున్నారు. వీళ్ల అతి చూసిన ఆడియన్స్ ఇదేమి యాంకరింగ్ అంటూ నొచ్చుకుంటున్నారు.

రీసెంట్ గా జరిగిన సినిమా ఫంక్షన్లు నిర్వహించిన తీరు చూస్తే సుమ లేని లేటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. స్టేజ్ పై హడావుడి చేస్తేనే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుందనే తీరులో కొత్త యాంకర్లు హంగామా చేస్తున్నారు. ఇది చూశాక సుమ ఉండుంటే ఈ ప్రోగ్రాం ఇలా ఉండేది కాదంటూ సినీ జనాలే అనుకుంటున్నారంటే మామూలు ప్రేక్షకులు ఆమెను మరింత మిస్సవుతున్నారని క్లియర్ గా చెప్పేయొచ్చు.