Begin typing your search above and press return to search.
మాస్ సినిమాలు కావాలి గురూ!
By: Tupaki Desk | 8 July 2019 6:24 AM GMTగత రెండు మూడు వారాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా ఏదో ఒక హిట్ నమోదవుతూనే ఉంది. కానీ రెవిన్యూ పరంగా మాత్రం అద్భుతాలేమి జరగడం లేదు. నిజానికి ఇది విచిత్రమైన పరిస్థితి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ-బ్రోచేవారెవరురా-ఓ బేబీ వరసగా మూడు శుక్రవారాల నుంచి మంచి రిపోర్ట్స్ రివ్యూస్ తో పాటు ప్రేక్షకుల మెప్పు పొంది పాస్ అయిన సినిమాలు. కానీ టికెట్ కౌంటర్ల దగ్గర పరిస్థితి మాత్రం సోసోగానే ఉండటం గమనార్హం.
ఏ సెంటర్స్ లో మంచి రన్ తో ఇవి వసూళ్లను రాడుతున్నప్పటి కింది స్థాయి బిసి కేంద్రాల్లో మాత్రం కేవలం ఫీడింగ్ కోసమే తప్ప ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదని ఎగ్జిబిటర్ల మాట. ఇందులో వాస్తవం ఉంది. దీనికి కారణం ఇవేవి మాస్ ని టార్గెట్ చేసిన సినిమాలు కాకపోవడం. మహారాజా పోషకులుగా భావించే మాస్ మెచ్చే యూనానిమస్ మూవీ గత రెండు నెలలలో రాలేదనే చెప్పాలి. ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వచ్చిన స్టార్ల సందడి తర్వాత మళ్ళీ మహర్షినే ఆ రేంజ్ లో సత్తా చాటింది. ఆ స్థాయిలో సగం వసూళ్లు కూడా ఇంకే సినిమాలు రాబట్టలేకపోయాయి.
కేవలం ఓ రెండు మూడు వర్గాల్ని తప్పించి అందరిని మెప్పిస్తున్న చిత్రాలు వచ్చినప్పుడే కౌంటర్లు కళకళలాడతాయి. పరిస్థితి చూస్తుంటే ఆగస్ట్ దాకా ఈ పరిస్థితి తప్పేలా లేదు. బాగా జోష్ రావాలి అంటే సాహో బరిలో దిగాల్సిందే. అంతకన్నా ముందు రణరంగం-మన్మథుడు 2 వస్తున్నాయి కాబట్టి ఇంకొంత ఊపొచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెలాఖరున వస్తున్న డియర్ కామ్రేడ్ సైతం జోరు మీద వస్తోంది. ఈ 18న ఇస్మార్ట్ శంకర్ ఉంది. ఊర మాస్ కంటెంట్ కనిపిస్తున్న ఈ శంకర్ కనక హిట్టు కొడితే జోష్ అక్కడి నుంచే మొదలవుతుంది. లేదా ఆపై ఆగస్ట్ దాకా మాస్ కు ఎదురు చూపులు తప్పవు