Begin typing your search above and press return to search.
నిర్మాతల మండలి ఎన్నికల హీట్
By: Tupaki Desk | 9 Jun 2019 4:33 AM GMTటాలీవుడ్ లో యేటేటా 200 పైగా సినిమాలు రిలీజవుతున్నాయి. ఇన్ని సినిమాలపై వందల - వేల కోట్ల జూదం నడుస్తోంది. కేవలం 5-10 శాతం మాత్రమే సక్సెస్ రేటు ఉండే ఈ పరిశ్రమలో పెట్టుబడుల వెల్లువకు కారణం కేవలం కళా తృష్ణ మాత్రమేనని చెబుతుంటారు. కళా రంగంపై మక్కువతోనే ప్రతియేటా వందలాదిగా నిర్మాతలు టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. అయితే ఇలా వచ్చే వాళ్లలో అవగాహనతో వచ్చేవాళ్లు కొందరు అయితే.. ఏ అవగాహన లేకుండా వచ్చి చేతులు కాల్చుకునేవాళ్లు మెజారిటీ పార్ట్ ఉంటారు. అయితే ఇలాంటి వారికి మార్గ దర్శనం చేసేందుకు.. దిశా నిర్ధేశనం చేసేందుకు నెలకొల్పినదే తెలుగు సినిమా నిర్మాతల మండలి. అంతటి కీలకమైన నిర్మాతల మండలికి ఎన్నికలు అంటే మామూలుగా ఉంటుందా? ఓ రేంజులో వివాదాలు తప్పనిసరి.
తాజాగా నిర్మాతల మండలి ఎన్నికల తేదీని అధికారికంగా ప్రకటించారు. 30-06-2019వ తేదీ ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3.00 గంటల తర్వాత నుండి లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం 9.00 గంటల లోపు రిజల్ట్ వెలువడనుంది. ఇక జూన్ 12 నుంచి జూన్ 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు తేదీని ఫైనల్ చేశారు. రెండు ఆపై ఎక్కువ పోస్టులకు నామినేషన్ వేసినవారు 18వ తేదీ లోపల ఏదో ఒక పోస్ట్ వుంచుకుని మిగిలినవి ఉపసంహరించుకోవాలి. ఒకే పోస్ట్ కు నామినేషన్ వేసినవారు 22వ తేదీ లోపల ఉపసంహరించుకోవాలి. 22 వ తేదీ సాయంత్రం పోటీలో వున్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా నిర్మాతల మండలి ఎన్నికలకు సంబంధించిన సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఇక అధికారికంగా ఒక కొత్త బాడీని నిర్మాతలు ఎంపిక చేసుకోబోతున్నారని అర్థమవుతోంది. ఈసారి ఎన్నికయ్యే కొత్త బాడీ నిర్మాతల మధ్య ఉన్న అంతర్గత సమస్యల్ని పరిష్కరిస్తూ ఈ రంగంలో ప్రవేశించే కొత్తవారికి దిశా నిర్ధేశనం చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.