Begin typing your search above and press return to search.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం..!

By:  Tupaki Desk   |   20 April 2021 12:56 PM GMT
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం..!
X
కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ లో టెన్షన్ మొదలైంది. గతేడాది కోవిడ్ కారణంగా తీవ్ర నష్టాలను చవి చూసిన ఇండస్ట్రీ.. అలాంటి పరిస్థితిని పునరావృతం అవుతోందని కలవరపడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కరోనాను కట్టడి చేయడానికి చర్యలు చేపడుతున్నారు. తెలంగాణలో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నారు. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి 8 గంటల వరకే థియేటర్స్‌ నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా సినిమా షూటింగ్‌ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

ఎమర్జెన్సీ షూటింగ్స్ మాత్రమే జరుపుకోవాలని తెలుపుతూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పాండమిక్ కండీషన్స్ లో అవసరమైన మార్గదర్శకాల్ని పాటిస్తూ పరిమిత బృందంతో షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసరం అనుకుంటే 50 మంది సినీ కార్మికులతో మాత్రమే షూటింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలియజేసింది. ఇకపోతే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు మీడియం మరియు భారీ బడ్జెట్ సినిమాలు షూటింగులు వాయిదా వేసుకున్నారు. మరికొన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నారు.