Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్‌ - సురేశ్‌ బాబుని చూసైనా మారండి గురూ

By:  Tupaki Desk   |   27 Dec 2018 1:30 AM GMT
అల్లు అరవింద్‌ - సురేశ్‌ బాబుని చూసైనా మారండి గురూ
X
బిజినెస్‌ అంటే ఏంటి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించడం. సినిమాలో ఇండస్ట్రీలో కూడా ఇంతే. ఇక్కడే చేసేది మొత్తం బిజినెస్సే కాబట్టి దీన్ని ఇండస్ట్రీ అన్నారు. కానీ కొంతమంది దర్శకులకు మాత్రం ముందు చూపు లేకపోవడం వల్ల.. నిర్మాతలకు నష్టాలు మిగులుస్తున్నారు. హను రాఘవపూడినే తీసుకోండి. పడి పడి లేచె మనసు సినిమా బడ్జెట్‌ అనుకున్న లిమిట్‌ దాటిపోయింది. అలాగని దాటిన బడ్జెట్‌ అంత మార్కెట్‌ శర్వానంద్‌ కి ఉందా అంటే లేదనే చెప్పాలి. దీంతో.. ఇప్పుడు నిర్మాతలకు నష్టాలు తప్పడం లేదు. గతంలో లై సినిమా టైమ్‌ లో కూడా ఇంతే. దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టించాడు. కానీ నితిన్‌ మార్కెట్‌ రేంజ్‌ 15 కోట్లే. దీంతో.. సినిమా బాగుందని టాక్‌ వచ్చినా నష్టాలు మాత్రం తప్పలేదు.

అంతరిక్షం డైరెక్టర్‌ సంకల్ప్‌ రెడ్డి కూడా నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టాడు. ఘాజీ సినిమాలో హీరో రానా అవ్వడం వల్ల.. అతడికున్న హిందీ మార్కెట్‌ ప్లస్‌ అయ్యింది. కానీ ఇక్కడే వరుణ్‌ ది ఓన్లీ రీజినల్‌ మార్కెట్‌. అదీగాక సినిమా ఫ్లాప్‌ అయ్యింది. హిట్‌ అయితేనే డబ్బులు వెనక్కి వస్తాయో లేదో తెలీని పరిస్థితి. అలాంటిది ఫ్లాప్‌ సినిమాకు ఎలా వస్తాయి. ఈ కుర్ర డైరెక్టర్లు - హీరోలు - నిర్మాతలు.. ఎందుకు అల్లు అరవింద్‌ - సురేశ్‌ బాబుని చూసి నేర్చుకోరు. అల్లు అరవింద్‌ కు గీత గోవిందం - ట్యాక్సీవాలా సినిమాలతో ఫుల్లుగా డబ్బులు వచ్చాయి. ఈ రెండు సినిమాల బడ్జెట్‌ పదికోట్లు దాటలేదంటే మీరు నమ్మగలరా. అలాగే.. సురేశ్‌ బాబుకు 40 కోట్లు పెట్టి సినిమా తీసే సత్తా లేదా. ఉన్నా కూడా ఎందుకు తీయడం లేదు. ఒక హీరో మార్కెట్‌ ఎంత - రిటర్న్స్‌ ఎంత వస్తాయి - ఎన్ని రోజులు ఆడితే బ్రేక్‌ ఈవెన్‌ వస్తుంది.. ఇలాంటి లెక్కలెన్నీ వేసుకుని వాళ్లు సినిమాలు తీస్తారు. అందుకే విజయవంతమైన నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే డైరెక్టర్లు - నిర్మాతలు అల్లు అరవింద్‌ - సురేశ్‌ బాబుని చూసి నేర్చుకుంటే బెటర్‌.