Begin typing your search above and press return to search.
ఆగస్ట్ 11కి 100 కోట్ల పందెం
By: Tupaki Desk | 8 July 2017 5:05 AM GMTసెలవల సీజన్ ని చూసుకుని సినిమాలు రిలీజ్ చేయడం అన్ని భాషల్లోనూ ఉన్న ఆనవాయితీనే. బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ నుంచి.. చిన్న సినిమాల వరకూ సెలవలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు. కానీ.. వీకెండ్స్ కు సెలవలు కలిసొచ్చి.. ఐదు రోజుల పాటు జనాలతో థియేటర్లు నిండిపోయే అవకాశం అరుదుగా వస్తుంది. అలాంటి అవకాశాన్ని వదులుకునేందుకు మేకర్స్ సిద్ధంగా ఉండరు.
ఇప్పుడు ఆగస్ట్ 11 గురించి టాలీవుడ్ లో అలాంటి పోటీనే కనిపిస్తోంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ హాలిడే కలిసి రావవడంతో.. శుక్రవారం నుంచి మంగళవారం వరకూ వసూళ్లు రాబట్టుకోవచ్చు. అందుకే ఆగస్ట్ 11 విడుదల కోసం పలు సినిమాలు క్యూ కట్టేశాయి. కానీ ఆ సీజన్ కు విడుదల అవుతాయని భావిస్తున్న సినిమాల బడ్జెట్.. ఏకంగా 115 కోట్లు కావడం గమనించాలి. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం 'లై'. ఆగస్ట్ 11 రిలీజ్ ను యూనిట్ ఖాయం చేసేసింది. నితిన్ కి జోడీగా మేఘా ఆకాష్ నటించిన ఈ చిత్రం బడ్జెట్ 35 కోట్లు.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా.. రకుల్ ప్రీత్ సింగ్- ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్స్ గా నటించగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూవీ జయ జానకి నాయక. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తెరకెక్కిన ఈ మూవీని కూడా ఆగస్ట్ 11న విడుదల చేయడం ఖాయం.
మరోరెండు సినిమాలు కూడా అదే డేట్ ను టార్గెట్ చేసుకుని చకచకా పనులు పూర్తి చేసేస్తున్నారు. నాగచైతన్య హీరోగా కొత్త దర్శకుడు కృష్ణ రూపొందించిన యుద్ధం శరణం మూవీకి 20 కోట్ల బడ్జెట్ అంటున్నారు. దగ్గుబాటి రానాతో తేజ తీసిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం కోసం 16 కోట్లు ఖర్చు కాగా.. ఈ రెండు సినిమాలను కూడా ఆగస్ట్ 11కే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.