Begin typing your search above and press return to search.

ఆగస్టు 11..దున్నేసుకుంటారా? కొట్టుకుంటారా?

By:  Tupaki Desk   |   28 July 2017 5:45 PM GMT
ఆగస్టు 11..దున్నేసుకుంటారా? కొట్టుకుంటారా?
X
ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన అతి పెద్ద హాలిడే సీజన్ అంటే.. సంక్రాంతి సెలవల తరువాత ముఖ్యంగా చెప్పుకోవల్సింది దసరా సెలవలే. కాని అనుకోకుండా ఇప్పుడు మధ్యలో ఒక హాలిడే వచ్చింది. దానితో ఒక లాంగ్ వీకెండ్ తయారైంది. ఆ వీకెండ్ లో ఆధిపత్యం చూపించాలని ఎవరికివారే తమ సినిమాలతో ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సెలవు ఉంది కాబట్టి.. ఆగస్టు 11 శుక్రవారం సినిమాను రిలీజ్ చేస్తే.. 15 మంగళవారం వరకు లాంగ్ వీకెండే. చాలామంది సోమవారం సెలవు పెట్టేసి మరి అటూ ఇటూ చెక్కేస్తున్నారు. అందుకే మన తెలుగులో ఇప్పుడు మూడు సినిమాలు ఆ తేదీన కన్ఫామ్ గా వచ్చేసి రచ్చ చేయాలని చూస్తున్నాయి.

అసలు తాము అనుకున్న డేటుకు వచ్చి తీరతామని.. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గేదే లేదని ఈరోజే ''లై'' సినిమా టీమ్ కన్ఫామ్ చేసింది. నితిన్ హీరోగా హను రాఘవపూడి డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను ఏకంగా 40 కోట్ల వ్యయంతో రూపొందించారనే టాక్ ఉంది కాబట్టి.. ఈ సినిమాను ఈ ఇండిపెండెన్స్ వీక్ లో క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బోయపాటి శ్రీను డైరక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ డైరక్షన్ లో రూపొందిన ''జయ జానకి నాయక'' సినిమా కూడా అదే రోజున వస్తోంది. ఈ సినిమాకి 45 కోట్లు బడ్జెట్, అయితే బోయపాటికి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని సమాచారం. దీంతో ప్రచారం కూడా పెద్ద స్ధాయిలో చేస్తున్నారు. ఇక ''నేను రాజు నేనే మంత్రి'' అనే చెప్పాలి. రానా దగ్గుబాటి హీరోగా తేజ డైరక్షన్ లో రూపొందిన ఈ సినిమా కూడా సురేష్ బాబు గట్టి బడ్జట్ తోనే తీశాడు.

ఇకపోతే ఈ మూడు సినిమాల్లో దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది? ఎవరు ఎక్కువ వసూలు చేస్తారు? అంటే చెప్పడం కష్టం. నిజానికి 'లై' టీజర్ అదిరిపోయింది. 'జయ జానకి నాయక' టీజర్ లో బోయాపటి మార్కు ఇరగదీసింది. 'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ కూడా చాలా బాగా నచ్చేసింది అందరికీ. అందుకే ఈ మూడు సినిమాలకూ సరైన ఛాన్సులే ఉన్నాయి. అయితే వీరికి ధియేటర్లు సరిగ్గా ఇవ్వకపోతే ఆ సినిమా నష్టపోయే ఛాన్సుందా? అబ్బే అదీ లేదు. రానా సినిమాకు సురేష్ బాబు ఉండగా.. నితిన్ సినిమాకు సుధాకర్ రెడ్డి ఉండగా ధియేటర్ల కొరవేంటి?? ఛాన్సే లేదు. ఇక జయ జానకి నాయక సినిమాను కూడా పెద్ద పెద్ద డిస్ర్టిబ్యూటర్లే మార్కెట్ చేస్తున్నారు. కాబట్టి ఆ సినిమాకు ధియేటర్ల కొరత ఏమీ రాదు.

ఆ లెక్కన చూసుకుంటే ఈ మూడు సినిమాలకూ సమానమైన ఛాన్సులు ఉన్నాయి. ఇంకా 10 రోజులపైనే టైమ్ ఉంది కాబట్టి.. ఎవరు గట్టిగా ప్రమోట్ చేసుకుంటే వారికి గట్టిగా అవకాశాలు ఉంటాయి. ఇక ఏ సినిమా లోపల కంటెంట్ గట్టిగా ఉంటే వారికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరి ఎవరు బాక్సాఫీస్ దగ్గర ఈజీగా దున్నేసుకుంటారు.. ఎవరు పక్కనున్న పోటీ సినిమాతో కొట్టేసుకుంటారు అనేది.. ఆగస్టు 11నే తెలుస్తుంది. అది సంగతి.