Begin typing your search above and press return to search.
పండగ చేస్కోండి.. పైరసీ చూడకండి
By: Tupaki Desk | 10 Aug 2017 1:30 PM GMTరేపు ధియేటర్లలో నిజంగానే పండగ. సాధారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు తప్పిస్తే అసలు సంవత్సరంలో ఎప్పుడూ ధియేటర్ల దగ్గర ఇటువంటి పోటీ అనేది మనకు కనిపించదు. మనోళ్ళు సేఫ్ గేమ్ ప్లే చేస్తూ.. చిన్ని చిన్న సినిమాలను కొట్టుకోమని చెబుతూ.. పెద్ద సినిమాలను మాత్రం ఒక శక్రవారం ఒకటే అన్నచందాన తీసుకొస్తారు. కాని ఇప్పుడు సడన్ గా.. ఎవ్వరూ అనుకోని విధంగా.. మూడు సినిమాలు భలే బరిలోకి దిగాయ్.
రానా దగ్గుబాటి హీరోగా తేజ డైరక్షన్లో రూపొందిన 'నేనే రాజు నేనే మంత్రి'.. హను రాఘవపూడి డైరక్షన్లో నితిన్ హీరోగా 'లై'.. బోయపాటి శ్రీను డైరక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ 'జయ జానకి నాయక' అంటూ ఒకేసారి ధియేటర్లలోకి వస్తున్నారు. రానా సినిమాకు ట్రైలర్ బాగా పండితే.. నితిన్ సినిమాకు యూత్ లో మనోడికి ఉన్న క్రేజ్ ప్లస్సయిపోయింది. ఇక బోయపాటి మూవీకి ఆయనే పెద్ద ఎస్సెట్. అలాగే స్టార్ హీరోయిన్ల గ్లామర్ కూడా అదనపు ఆకర్షణ అయిపోయింది. అందువలను ఈ మూడు సినిమాలకూ ఒకరికి ఒకరు తీసిపోనంతగా క్రేజ్ ఏర్పడింది.
ధియేటర్లలో ఈక్వేషన్లో కొన్ని గొడవలు ఉన్నాయని.. సురేష్ బాబు అండ్ దిల్ రాజుకు కాసింత మాటల తూటాల సెగ కూడా తగిలిందని వినిపిస్తున్నప్పటికీ.. రమారమీ అన్ని సినిమాలూ భారీగానే భారీ సంఖ్యలో ధియేటర్లను బుక్ చేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ మూడు సినిమాలకూ గట్టిగానే ప్రమోషషన్లు కూడా చేశారు. సో ఈ శుక్రవారం పడే మొదటి ఆటకు ఖచ్చితంగా అన్ని సినిమాలకూ జనాలు గట్టిగానే వస్తారు. అక్కడి నుండి నడిపించేది మాత్రం కేవలం మౌత్ టాకే. సినిమాలకు పాజిటివ్ రివ్యూ వస్తే తిరుగుండదు. నెగెటివ్ వస్తే మాత్రం ఎంత ప్రమోషన్ చేసినా ఉపయోగం ఉండదు.
ఆల్రెడీ ఈ ముప్పేటి కాంపిటీషన్ గురించి అందరూ హిట్టవ్వాలని కోరుకుంటా ట్వీట్లు వేసిన రానా.. నితిన్ అండ్ రకుల్ కు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక సమంత వంటి స్టార్లు కేవలం రానా ఒక్కడికే విషెస్ చెప్పినా.. ఇతరులు మాత్రం ముగ్గురుకీ విషెస్ తెలిపారు. హీరో నితిన్ ఈ కాంపిటీషన్ పై మరోసారి స్పందిస్తూ.. ''పండగలాంటి వాతావరణం నెలకొంది. ఆగస్టు 11 ఎంతో స్పెషల్ అయిపోయింది. పండగ చేస్కోండి కాని సినిమాలను పైరసీలో కాకుండా మీకిష్టమైన సినిమాను మీకు నచ్చిన ధియేటర్లోనే చూడండి'' అంటూ చెబుతున్నాడు.
'ప్రేక్షకులే రాజు ప్రేక్షకులే మంత్రి' కాబట్టి.. ఈ ఫిలింమేకర్ల కలలన్నీ 'లై' గా మిగలకుండా వారికి ఒక బ్లాక్ బస్టర్ ను ఇచ్చేసి 'జయ విక్టరీ నాయకా' అంటూ మూడు సినిమాలకూ బాక్సాఫీస్ దగ్గర బెస్ట్ రిజల్ట్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. ముగ్గురు దర్శకులూ.. ముగ్గురు హీరోలూ.. ఐదుగురు హీరోయిన్లు.. అలాగే ఈ సినిమాలను తీసిన ముగ్గురు ప్రొడ్యూసర్లూ.. శుక్రవారం పొద్దు ఎప్పుడు పొడుస్తుందా అని ఆశగా చూస్తున్నారు. వారి సినిమాల తాలూకు రివ్యూలను మీరు తుపాకీ.కాం లో చదవడానికి మీరు కూడా సిద్దంకండి మరి!!