Begin typing your search above and press return to search.
గూగుల్ ని వాడేస్తున్న టాలీవుడ్
By: Tupaki Desk | 1 Sep 2017 5:57 AM GMTకొత్త కాన్సెప్ట్ ఏదైనా వచ్చిందంటే.. ప్రచారం కోసం దాన్ని ఉపయోగించేసుకోవడం చూస్తూనే ఉంటాం. కొందరు ట్రెండ్ సెట్ చేస్తుంటారు.. కొందరు ఫాలో అయిపోతుంటారు. కొన్నాళ్లకు జనాలకు కూడా ఇదంతా అలవాటయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సినిమాల కోసం గూగుల్ ని ఉపయోగించడం కూడా జనరలైజ్ అయిపోతోంది.
ఇప్పటికే యూట్యూబ్ ను ఓ బెంచ్ మార్క్ కింద సెట్ చేసేసుకున్న టాలీవుడ్ జనాలు.. ఇప్పుడు గూగుల్ యాడ్స్ ను కూడా వదలడం లేదు. ఇప్పటివరకూ కమర్షియల్ ప్రొడక్ట్స్ ప్రచారంలో కనిపించిన గూగుల్ యాడ్స్.. ఇప్పుడు సినిమాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేసినా కనిపించే ఈ యాడ్స్ ద్వారా సినిమాలకు మరింతగా ప్రచారం లభిస్తోంది. అఫ్ కోర్స్ ఇలాంటి యాడ్స్ కారణంగా గూగుల్ యాడ్ సెన్స్ తో రెవెన్యూ కూడా వచ్చే అవకాశం ఉన్నా.. ఇది కమర్షియల్ సేల్ కాదు కాబట్టి.. వచ్చే రెవెన్యూ కంటే.. పెట్టాల్సిన ఖర్చే ఎక్కువగా ఉంటుంది.
అయితే ఆన్ లైన్ లో తమ ప్రెజెన్స్ పెంచుకునేందుకు గాను.. పెద్ద హీరోలంతా ఈ గూగుల్ యాడ్స్ ను బాగానే వాడేస్తున్నారు. చూడాలని అనుకునే వారి ఆప్షన్.. స్థానికత ఆధారంగా వచ్చే ఈ కస్టమైజ్డ్ యాడ్స్.. ప్రస్తుతం జనాలకు కాసింత కొత్తగానే ఉంది. ఇప్పటికే ఈ ట్రెండ్ కొంతమే ఉన్నా.. యుద్ధం శరణం గచ్ఛామి కోసం నాగార్జున అండ్ టీం.. గూగుల్ యాడ్స్ ను చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానుండడంతో.. రాబోయే సినిమాలకు సంబంధించిన యాడ్స్.. విపరీతంగా దర్శనం ఇచ్చే అవకాశాలే ఉన్నాయ్.