Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఆహ అనిపిస్తున్న అ! బ్యూటీ

By:  Tupaki Desk   |   4 March 2019 8:58 AM GMT
ఫోటో స్టొరీ: ఆహ అనిపిస్తున్న అ! బ్యూటీ
X
తెలుగు బ్యూటీలకు టాలీవుడ్ లో అవకాశాలు రావని అంటూ ఉంటారు కానీ ఈషా రెబ్బా మాత్రం చాలా సినిమాలలో నటించి అది నిజంకాదని ప్రూవ్ చేసింది. కానీ ఈమధ్య మాత్రం జోరు తగ్గింది. ఆఫర్ల సంగతి పక్కన పెడితే.. ఈషా సోషల్ మీడియాలో ముంబై భామలకు తెలుగు బ్యూటీలు ఏమీ తీసిపోరన్నట్టుగా క్రేజీ ఫోటో షూట్లు చేస్తూ నెటిజనులను ఆకట్టుకుంటోంది.

తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా మరో ఫోటో పోస్ట్ చేసింది. దానికి క్యాప్షన్ గా రెండు బ్లాక్ కలర్ లో ఉన్న లవ్ ఎమోజీలను పెట్టింది. డ్రెస్ విషయానికి వస్తే స్టైలిష్ గా పార్టీ వేర్ లాంటి తళుకుబెళుకుల డిజైన్ లో దర్శనమిచ్చింది. పొట్టిగా ఉండే బ్లాక్ కలర్ బేర్ బ్యాక్ గౌన్ లో స్టైల్ గా సైడుకు తిరిగి నిలబడింది. అవర్ గ్లాస్ లాంటి షేపుతో నెటిజనులను మెస్మరైజ్ చేస్తూనే మెంటల్ టార్చర్ పెడుతోంది.

ఎంత టార్చర్ పెట్టినా నెటిజనులు మాత్రం లైకులతో.. కామెంట్లతో ఈషాపై తమ అభిమానాన్ని కురిపించారు. కానీ ఒక నెటిజనుడు మాత్రం ఈ ఫోటోతో సంతృప్తి చెందినట్టుగా లేడు. "నీ ఇన్స్టా గ్రామ్ గోడపై అన్నీ ఫోటోలను వెతికా.. ఒక్క బికినీ ఫోటో కూడా లేదు.. ఫ్యూచర్ లో అయినా చూస్తానా?" అని ప్రశ్నించాడు. డియర్ ఈషా.. అభిమాని చెప్పింది అర్థం అయింది కదా.. ప్రత్యేక బికినీ డిమాండ్స్ అలా ఉన్నాయి.