Begin typing your search above and press return to search.

గ్రామాల గెటప్ లో హీరోల వీరత్వం

By:  Tupaki Desk   |   22 Jun 2017 6:52 AM GMT
గ్రామాల గెటప్ లో హీరోల వీరత్వం
X
తెలుగు సినిమాలో స్టార్ హీరోల సినిమాలంటే ఓ ఫార్ములా ప్రకారం ఉంటాయి. మాస్ అప్పీల్ కోసం.. ఒకరికి మించి మరొకరు హీరోయిజం చూపించేస్తుంటారు. అయితే.. కొన్నేళ్లుగా హీరో కేరక్టరైజేషన్ సిటీల్లోనే ఉంటోంది. ఖరీదైన దుస్తులు.. అల్ట్రా మోడర్న్ అవతారాలు.. ఫారిన్ కాస్ట్యూమ్స్ తో హంగామా చేస్తున్నారు. వాస్తవికతకు కాసింత దూరంగానే ఉంటున్నారు.

ఇప్పుడిప్పుడే హీరో కేరక్టరైజేషన్ లో కాకపోయినా.. గెటప్ లో మాత్రం మార్పులు వస్తున్నాయి. రేపు రిలీజ్ కానున్న దువ్వాడ జగన్నాధం మూవీలో.. అల్లు అర్జున్ లుంగీ కట్టి కనిపించబోతున్నాడు. వంటలు చేసే బ్రాహ్మణుడి పాత్రలో లుంగీ కట్టి కనిపిస్తున్న అల్లు అర్జున్ లుక్ కి మంచి స్పందనే వచ్చింది. కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ కూడా లుంగీతోనే సినిమా అంతా కనిపించాడు. కాటమరాయుడు మూవీలో పాటలు మినహాయిస్తే.. సినిమా అంతా లుంగీలోనే ఉంటాడు హీరో. రెండేళ్ల క్రితం శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లుంగీ కట్టి కనిపించాడు. ఒక్క సీన్ లోనే అయినా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక రాబోతోన్న సినిమాల్లో నేనే రాజు నేనే మంత్రిలో రానా కూడా లుంగీలోనే కనిపించబోతున్నారు. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పీరియాడిక్ మూవీలో కూడా హీరో పాత్ర లుంగీలోనే ఉంటుందనే విషయం ఇప్పటికే అర్ధమైపోయింది. హీరోలు తమ గెటప్ ను గ్రామాలకు తీసుకొచ్చేసి మరీ వీరత్వాన్ని ప్రదర్శిస్తుండడం.. మన సినిమాల్లో వచ్చిన లేటెస్ట్ మార్పుగా చెప్పుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/