Begin typing your search above and press return to search.

హీరోలు ఫోకస్ అక్కడ పెట్టారు

By:  Tupaki Desk   |   6 Sep 2017 4:39 AM GMT
హీరోలు ఫోకస్ అక్కడ పెట్టారు
X
ఈ రోజుల్లో సినిమా ఎంత బాగా తీశారన్న దానితోపాటు ఎంత బాగా ప్రమోట్ చేశారన్నది కూడా చాలా కీలకంగా మారుతోంది. సినిమా రిలీజ్ కు ముందే ఎంత బజ్ ఏర్పడితే అంత ఉఫయోగం. సినిమాకు సంబంధించిన విషయాలు.. విశేషాలు రిలీజ్ కు ముందుగానే జనాలకు ఎంత బాగా రీచ్ అయితే అంత మంచిది. అయితే రిలీజ్ కన్నా ముందే సినిమాపై ఆసక్తి చూపేవారు.. అందుకు సంబంధించిన విశేషాలు నలుగురితో షేర్ చేసుకునే వారిలో యూత్ ఎక్కువగా ఉంటారు.

అందుకే ప్రస్తుత యంగ్ హీరోలు యూత్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఒకేసారి వందలమందిని యువతను కలిసే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అంటే... అది కాలేజీయే. అందుకే సినిమా ప్రమోషన్స్ కోసం కాలేజీల్లో వాలిపోతున్నారు. వాళ్లతో కలిసిపోయి అల్లరి చేయడంతోపాటు సెల్ఫీలు దిగుతూ.. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ బాగానే పనిచేస్తోంది. నేనే రాజు.. నేనే మంత్రికి సినిమాకు మందు రానా... కేశవ సినిమాకు ముందు నిఖిల్.. విజయ్ దేవరకొండ ఇలా వీరంతా కాలేజీలకెళ్లి యూత్ ను పలకరించారు. ఈ క్లబ్ లో అక్కినేని వారి హీరో నాగచైతన్య కూడా చేరాడు. తన లేటెస్ట్ సినిమా యుద్ధం శరణం ప్రమోషన్లలో రీసెంట్ గా వైజాగ్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లొచ్చాడు. సినిమా రిలీజయ్యేలోగా మరికొన్ని కాలేజీలకు వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నాడు.

సినిమా ఎంతో బాగుంటే తప్ప రిపీట్ ఆడియన్స్ ఉండరు. అలా వచ్చేవాళ్లలోనూ మళ్లీ యూత్ ఎక్కువ. అందుకే వారిలో ఆసక్తి కలిగించడమే లక్ష్యంగా యంగ్ హీరోలు ప్లాన్ చేస్తున్నారు. ఇలా టార్గెట్ ఆడియన్స్ కలిసే ట్రెండ్ ఇంతకుముందు బాలీవుడ్ లో ఉండేది. ఈమధ్యనే టాలీవుడ్ దీనిని అందిపుచ్చుకుంది.