Begin typing your search above and press return to search.
భారీ మల్టీస్టారర్ ని వదులుకున్న తెలుగు హీరో
By: Tupaki Desk | 11 Feb 2022 3:39 AM GMTఒక్కోసారి తెలిసో తెలియకో తప్పులు జరిగిపోతుంటాయి. అలాంటి ఒక తప్పును యువహీరో సుధీర్ బాబు చేశారా? అంటే ఎవరికి వారు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. ఇంతకీ సుధీర్ బాబు చేసిన తప్పేమిటీ? అంటే.. బాలీవుడ్ లో అత్యంత క్రేజీగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ బ్రహ్మాస్త్ర ఆఫర్ ని తిరస్కరించడమేననేది గుసగుస. నిజానికి ఇది కరణ్ జోహార్ లాంటి అగ్ర దర్శకనిర్మాత రూపొందిస్తున్నది. పైగా బహుభాషల్లో విడుదల కానుంది. అందువల్ల సుధీర్ బాబు ఈ ఆఫర్ ని తిరస్కరించడం సమంజసమేనా? అంటూ విశ్లేషిస్తున్నారు.
అది కూడా సమ్మోహనం లాంటి సినిమా కోసం సుధీర్ బాబు బ్రహ్మాస్త్ర ఆఫర్ ని తిరస్కరించానని అన్నారు. తన స్నేహితుడు గురువు అయిన ఇంద్రగంటితో కమిట్ మెంట్ కోసం అతడు ఈ ఆఫర్ ని వదులుకుని ఉండవచ్చు. పైగా రోమ్ కామ్ లో నటించాలనే ఉద్ధేశంతోనే బ్రహ్మాస్త్ర ఆఫర్ వదులుకున్నానని సుధీర్ తెలిపాడు. ఇక తన కారణాలు తనకు ఉన్నా కానీ.. ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ కనిపిస్తోంది. యూనవర్శల్ కాన్సెప్టులను ఎంచుకునే హీరోలకు ఆఫర్లు కొదవేమీ లేదు. అన్ని భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ అవుతున్నారు. ఒకవేళ సుదీర్ బాబు బ్రహ్మాస్త్రను అంగీకరించి ఉంటే అతడు పాన్ ఇండియాకి కనెక్టయ్యేవాడేనని అభిమానులు భావిస్తున్నారు. ఇంతకుముందు భాఘి 2లో విలన్ గా నటించి గొప్పగా మెప్పించాడు. కానీ తర్వాత దానిని బాలీవుడ్ లో క్యాష్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర లాంటి భారీ మూవీలో విలన్ గా అవకాశం వస్తే కాదనుకున్నాడు. కరణ్ పిలిచి అడిగినా కాదనేశాడు. మరి దీనిని తప్పిదం అని కూడా అభిమానులు అంటున్నారు.
ఏది ఏమైనా తన కారణలు తనకు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కు బావ అయిన సుధీర్ బాబు ప్రేమ కథా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత భలే మంచి రోజు- సమ్మోహనం- వి- శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాల్లో నటించాడు. 2016లో వచ్చిన బాఘీ చిత్రంలో విలన్ గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధీర్ బ్రహ్మాస్త్ర నిర్మాతలు తనకు ఈ సినిమాలో విలన్ పాత్రను ఆఫర్ చేశారన్నారు. కానీ అదే సమయంలో సమ్మోహనం రూపంలో మరో ఆఫర్ రావడంతో దాన్ని తిరస్కరించానని తెలిపాడు.
గతంలో విలన్ రోల్ చేశానని సమ్మోహనం లాంటి బ్రీజీ రోమాంటిక్ మూవీని చేయలేదని భావించి ఆ సినిమాను ఎంచుకున్నాడట. రణ్‌బీర్ కపూర్- అలియా భట్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఇందులో అమితాబ్ బచ్చన్- నాగార్జున మౌని రాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాస్త్ర మొదటి భాగం 9 సెప్టెంబర్ 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.