Begin typing your search above and press return to search.
స్టార్ హీరోలకు ఆ పిచ్చి వదిలింది
By: Tupaki Desk | 8 Sep 2015 5:32 PM GMTస్టార్ హీరోల సినిమాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. క్యారెక్టర్ లలో హీరోయిజం ఎక్కడా తగ్గకూడదు. మాస్ అంశాలకు లోటుండకూడదు. టైటిళ్లు యమ ‘మాస్’గా ఉండాలి. హీరో ఓరియెంటెడ్ గా ఉండాలి. ఈ కండిషన్స్ ఎవ్వరూ బయటికి చెప్పేవారు కాదు కానీ.. డైరెక్టర్ లే అలా అర్థం చేసుకుని ముందుకెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోలు, డైరెక్టర్లకు మాస్ టైటిళ్ల పిచ్చి వదిలింది. ఎన్టీఆర్ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో..’ అని టైటిల్ పెట్టడం దానికి తాజా రుజువు. కొన్నేళ్లు వెనక్కి వెళ్తే.. ఎన్టీఆర్ సినిమాకు ఇలాంటి సాఫ్ట్ టైటిల్ పెడతారని అస్సలు ఊహించి ఉండలేం. ఇలాంటి టైటిళ్లు పెడితే అభిమానులు ఊరుకోరని.. సినిమా మంచి ఫలితాన్నివ్వదని.. మాస్ ను ఆకట్టుకోదని.. ఏవేవో భ్రమలుండేవి. కానీ గత కొన్నేళ్లలో కొన్ని టైటిళ్లు ఆ భ్రమలన్నింటినీ తొలగించేశాయి.
పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమాకు ‘అత్తారింటికి దారేది’ లాంటి టైటిల్ పెడతారని ఎవరైనా ఊహించారా? త్రివిక్రమ్ ఈ టైటిల్ పెట్టినపుడు చాలామంది అభిమానులు గగ్గోలు పెట్టారు. టైటిల్ మార్చమని గోల చేశారు. కానీ పవన్ కానీ, త్రివిక్రమ్ కానీ తగ్గలేదు. ఆ సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. దీంతో మాస్ టైటిళ్ల పిచ్చి వదలడంలో ‘అత్తారింటికి దారేది’ పాత్ర చాలా కీలకం. అప్పటికే మహేష్ సైతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సాఫ్ట్ టైటిల్ తో మార్పు దిశగా మరో అడుగు వేశాడు. ప్రిన్స్ తాజా సినిమా ‘శ్రీమంతుడు’ టైటిల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందంటూ అభిమానులు మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడా సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. సన్నాఫ్ సత్యమూర్తి కూడా ఈ కోవలో వచ్చిన టైటిలే. ఎన్టీఆర్, సుకుమార్ ల సినిమాకు ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ పెట్టడానికి ఇవన్నీ దోహదం చేశాయి. మొత్తానికి మాస్ మాస్ అనకుండా.. టైటిళ్లను హీరో చుట్టూ తిప్పకుండా.. కథకు తగ్గట్లు టైటిళ్లు పెడుతుండటం మంచి పరిణామమే.