Begin typing your search above and press return to search.

హిందీ 'బిగ్ బాస్'లోకి తెలుగు హీరోయిన్..!

By:  Tupaki Desk   |   6 Jun 2021 7:30 AM GMT
హిందీ బిగ్ బాస్లోకి తెలుగు హీరోయిన్..!
X
దేశవ్యాప్తంగా టెలివిజన్ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. బాలీవుడ్ బిగ్ బాస్ త్వరలో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంవత్సరం షోలో సభ్యులుగా ఎవరు పాల్గొంటారో తెలుసుకోవాలనే ఉత్సాహం టీవీ ప్రేక్షకులలో మొదలయింది. ఇప్పటికే హిందీ బిగ్ బాస్ 14 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 15వ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుందని తెలుస్తుంది. అయితే ఈసారి షోలో పాల్గొనే పార్టిసిపేట్ చేయబోతున్న పేర్లను ఎప్పటికప్పుడు మీడియా కథనాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఓ సౌత్ యాక్ట్రెస్ కూడా హిందీ బిగ్ బాస్ 15లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ఆమె ఎవరో కాదు టాలీవుడ్ లో కూడా స్టార్ యాక్ట్రెస్ గా క్రేజ్ సొంతం చేసుకున్న భూమిక చావ్లా. ఈసారి బిగ్ బాస్ సిబ్బంది భూమికా చావ్లాలో తీసుకురావడానికి ఆసక్తిగా ఉన్నారట. అందుకోసం ఆల్రెడీ భూమికను బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించి చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. అలాగే భూమికతో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించిన నటిగా భూమిక మంచి స్టార్డం అందుకుంది. అసలు విషయం ఏంటంటే.. బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ సరసన 'తేరే నామ్' అనే మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ భామ.

ఆ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకొని పలు సినిమాలు చేసింది. కానీ భూమిక పూర్తిగా సౌత్ పైనే ఫోకస్ పెట్టింది. ఆ విధంగా రన్ - దిల్ నే జిసే అప్నా కహా, ఎంఎస్‌ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ లాంటి సినిమాలతో సహా ఇటీవలి చివరిసారిగా జీ5లో వెబ్ సిరీస్ భ్రమ్ లో కనిపించింది. టాలీవుడ్ స్టార్స్ అందరితో నటించింది భూమిక. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతోంది. మరి బిగ్ బాస్ యాజమాన్యంకు సల్మాన్ ఖాన్ స్వయంగా భూమిక పేరు సూచించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ భామ వెళ్లనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.