Begin typing your search above and press return to search.

డబ్బులు కోసమే అలా చేసిందట!

By:  Tupaki Desk   |   21 Aug 2017 10:29 AM GMT
డబ్బులు కోసమే అలా చేసిందట!
X
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు...! ఇదే సామెతను కాస్త అటు ఇటుగా హీరోయిన్లు బాగా ఫాలో అవుతారు. వీరు ఫాలో అయ్యే రూట్ ఏంటంటే అందం ఉండగానే నాలుగు డబ్బులె వెనకేసుకోవాలి. నటిగా ఎదిగేకంటే గ్లామర్ డాళ్స్ గా మారేందుకు నేటి తరం హీరోయిన్లు ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారు. డబ్బుకి డబ్బు క్రేజ్ కి క్రేజ్ రావడంలో అందమైన అమ్మాయిలు సినీ లోకంలో వాలిపోవడానికి తహతహలాడుతుంటారు. ఇలానే హీరోయిన్ గా స్టార్ రేంజ్ కి వెళ్లిన ఓ భామ కెరీర్ మొదట్లో అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. గ్లామర్ షోతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆ భామకి వయసు పెరిగే కొద్దీ కష్టాలు మొదలైయ్యాయి. రోజు రోజుకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఐటమ్ భామగా మారిన ఆ స్టార్ హీరోయిన్ కి అక్కడ కూడా చుక్కెదురైంది.

ఇలాగైతే లాభం లేదనుకొని ఓ అగ్ర దర్శకుడుతో సన్నిహితంగా ఉంటూ - లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అయితే రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పలేదన్నట్లు సోలోగా యాక్ట్ చేసిన ఆమెను జనాలు రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆ ఓల్డ్ బ్యూటీ డబ్బు కోసం ప్రొడక్షన్ డిజైనర్ గా మారి - ఓ స్టార్ హీరో సినిమాకి క్యాస్టూమ్స్ సమకూర్చిందని సమాచారం. డబ్బులు కోసం కోటి అవతరాలు ఎత్తే ఇండస్ట్రీలో ఎదొక పని చేస్తూ కెరీర్ ని సాగిస్తున్న ఆ బ్యూటీ పై ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ప్రశంసలు వినిపిస్తున్నాయి. మరి ఆ ఓల్డ్ బ్యూటీ ట్రై చేసి ఈ రూట్ ని మిగతా ముద్దుగుమ్మలు కూడా ఫాలో అవుతారేమో చూద్దాం.