Begin typing your search above and press return to search.
తెలుగు ఇండియన్ ఐడల్ లో మీటూ సింగర్?
By: Tupaki Desk | 23 Feb 2022 6:30 AM GMTమీటూ వివాదం దక్షిణాదిలో ప్రకంపణలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే వివాదం తెలుగు ఇండియన్ ఐడల్ లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రతీ శుక్రవారం, ప్రతీ ఆదివారం ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోకి న్యాయనిర్ణేతలుగా సంగీత దర్శకుడు తమన్, నిత్యామీనన్, సింగర్ కార్తీక్ వ్యవహరిస్తున్నారు.
ఇదే ఇప్పుడు వివాదానికి ప్రధాన కారణంగా మారింది. ఈ రియాలిటీ షోకు సంబంధించిన లాంచింగ్ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఇది గమనించిన నెటిజన్స్ నిర్వాహకులపై విమర్శలు చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ షోకు సంబంధించి జడ్జీలుగా వ్యవహరిస్తున్న తమన్, నిత్యామీనన్, కార్తీక్ లలో సింగర్ కార్తీక్ గతంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి ఆక్యూస్డ్ ని న్యాయనిర్ణేతగా కూర్చోబెట్టడం ఏంటని నెటిజన్ లు నిర్వాహకులపై సెటైర్లు వేస్తున్నారు.
మీటూ ఉద్యమాన్ని సౌత్ లో ఉదృతం చేసిన సింగర్ చిన్మయి శ్రీపాద. తమిళ ఫేమస్ రైటర్ వైరముత్తుతో పాటు సింగర్ కార్తీక్ పై కూడా చిన్మయి మీటూ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. 2018లో చిన్మయి చేసిన సంచలన ఆరోపణలపై అప్పట్లో కొంత మంది వ్యతిరేకించినా ప్రస్తుతం ఆమె వాదనకు సపోర్ట్ గా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.
ఈ సందర్భంగా చిన్మయి కొంత మంది యూసర్ లు తనకు పంపించిన స్క్రీన్ షాట్ లని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. `కొన్ని విశేషణాలు ముఖ్యమైనవి. అతను కార్తీక్ కాదు. అతను మీటూ నిందితుడు కార్తీక్. ఈ రోజుల్లో బాధితులకు పని దొరకడం కష్టంగా మారింది. కానీ నిందితులు మాత్రం న్యాయమూర్తులు అవుతున్నారు` అంటూ ఈ స్క్రీన్ షాట్ లలో వుంది.
దీనికి చిన్మయి బదులిస్తూ ` నాకు దీని గురించి అనేక డిమాండ్ లు వచ్చాయి. వ్యవస్థపై చట్టబద్ధంగా పోరాడుతున్న వ్యక్తిగా అలాంటి ప్రతిఘటనను నేను ఎదుర్కొన్నానని తెలిపింది. అంతే కాకుండా లైంగిక వేధింపులు ఒక సామాజిక సమస్య.. దీనిని అరికట్టడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. మనలో చాలా తక్కువ మంది మాత్రమే దీనిపై పోరాడుతున్నారు. కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు` అని చిన్మయి పేర్కొంది. ప్రస్తుతం చిన్మయి షేర్ చేసిన ఈ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.