Begin typing your search above and press return to search.
ఈ సంక్రాంతి మైత్రీ మూవీ మేకర్స్ వారిదే!
By: Tupaki Desk | 3 Jan 2023 1:30 PM GMTఈ సంక్రాంతికి ఐదు సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు. ప్రతీ సంక్రాంతికి తెలుగు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ మూవీస్ పోటీపడటం కామనే. కానీ ఆ పోటీలో చాలా వరకు తెలుగు సినిమాలదే పై చేయి అవుతూ వస్తోంది. ఈ పండక్కి కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలే అత్యధికంగా కనిపిస్తున్నాయి. కారణం ప్రేక్షకుల్లో క్రేజ్ తెలుగు సినిమాలకే వుంది కాబట్టి.
తెలుగు సినీ లవర్స్ డబ్బింగ్ సినిమాలని లైట్ తీసుకుంటున్నారు. వాటిపై పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు సినిమాలపైనే తమ ఫోకస్ ని చూపిస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివెల్ పరంగా తెలుగు ప్రేక్షకుల తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాకే ఇస్తున్నారు. డబ్బింగ్ సినిమాలని తరువాత చూసుకోవచ్చు. లేదంటే ఓటీటీల్లో చూసుకోవచ్చు అని ముందు సంక్రాంతికి ఫ్యామిలీస్ తో కలిసి తెలుగు సినిమాలని చూడాలని కోరుకుంటున్నారు.
అదీ కాకుండా డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్నా అవి రిలీజ్ అవుతున్నాయనే సంగతే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియడం లేదు. కారణం పెద్దగా డబ్బింగ్ సినిమాలకు ప్రమోషన్స్ చేయకపోవడమే. దీంతో ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాల ఊసే ఎత్తడం లేదని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`తో , చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో బరిలోకి దిగుతున్నా విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలని మైత్రీవారే నిర్మిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన `వీరి సింహారెడ్డి` జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.`క్రాక్` వంటి బ్లాక్ బస్టర్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన గోపీచంద్ మలినేని అదే ఊపుతో ఈ మూవీని తెరకెక్కించాడు. ఫస్ట్ గ్లిమ్స్ తో అదరగొట్టిన `వీర సింహారెడ్డి` ఇప్పటికీ అదే ఊపుని కొనసాగిస్తూ సందడి చేస్తోంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. జనవరి 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒంగోలు లోని ఏబీఎమ్ కాలేజీ గ్రౌండ్స్ లో భారీగా నిర్వహించబోతోంది.
ఇక ఈ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `వాల్తేరు వీరయ్య` రిలీజ్ కాబోతోంది. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కాబోతోంది. రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తుండటం, చాలా ఏళ్ల తరువాత చిరు ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై కూడా అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు సినిమాలే సంక్రాంతికి హంగామా చేయబోతుండటంతో ఈ సంక్రాంతి మైత్రీ మూవీ మేకర్స్ దే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.