Begin typing your search above and press return to search.
ఓటీటీలో కిక్కిచ్చే సినిమా ఒక్కటీ లేదు
By: Tupaki Desk | 15 July 2020 1:30 PM GMT2020 నీరసంగా తయారైంది. సరైన పెద్ద సినిమా ఒక్కటీ లేక ఆడియన్స్ లో నిరుత్సాహం అలుముకుంది. థియేట్రికల్ రిలీజ్ లేకపోయినా ఓటీటీ ఉంది అనుకుంటే అక్కడా సరైన తెలుగు సినిమా.. తెలుగు వెబ్ సిరీస్ ఒక్కటీ లేదు. ఏడాది ఆరంభంలో చూసిన అల వైకుంఠపురములో - భీష్మ సినిమాలు మినహా ఫుల్ గా ఎంటర్ టైన్ చేసిన సినిమా ఏదీ లేదు. ఇటీవల రిలీజైన కొన్ని నాశిరకం ఓటీటీ సినిమాలతో అస్సలు ఏమాత్రం సంతృప్తిగా లేరు ఆడియన్స్.
ప్రస్తుతం ఓ ఇరవై సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నా.. ఇవేవీ ఓటీటీలోకి రావు అని చెబుతున్నారు. అనుష్క నిశ్శబ్ధం.. రవితేజ క్రాక్ ఓటీటీల్లో రిలీజైపోతాయి అంటూ ప్రచారం సాగినా అది నిజం కాదని తెలిసింది. ఇవి రెండూ ఓ మోస్తరు సినిమాలే కాబట్టి వినోద ప్రియులు ఆసక్తిగానే వేచి చూసినా ఇప్పట్లో వచ్చేట్టు కనిపించలేదు. నిశ్శబ్ధం రిలీజ్ కి అమెజాన్ వాళ్లతో చర్చలు సాగుతున్నాయి. కానీ క్రాక్ ని ఓటీటీలో రిలీజ్ చేయమని నిర్మాతలే చెప్పారు. ఇక నాని- సుధీర్ బాబు నటిస్తున్న `వీ` చిత్రాన్ని ఓటీటీలోకి తెస్తారని భావించినా ఇప్పట్లో దానికి సంబంధించిన అప్ డేట్ ఏదీ లేదు. ఇక అగ్ర హీరోల సినిమాలేవీ ఓటీటీల్లోకి వచ్చే వీలు కనిపించడం లేదు.
అందుకే 2020లో వినోదం పూర్తిగా కోల్పోయినట్టే అయ్యింది. కనీసం దసరా.. క్రిస్మస్ కి అయినా థియేటర్లు తెరుచుకునే వీల్లేదు. అలాగని అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ లాంటి చోట్ల సరైన తెలుగు సినిమా ఏదైనా వస్తుందా అంటే కనిపించడం లేదు. ఇక తెలుగు కంటెంట్ కంటే హిందీ .. ఇంగ్లీష్ అనువాదాలే కాస్త బెటర్ గా ఓటీటీలో కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ (తెలుగు).. బ్రీథ్ లాంటి వెబ్ సిరీస్ లకు ఆదరణ దక్కింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం జనం వెయిటింగ్. అలాగే ఓపీఎస్ అనే టెర్రరిజం బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ కి చక్కని ఆదరణ దక్కింది. కానీ తెలుగులో స్ట్రెయిట్ వెబ్ సిరీస్ లు నీరసం తెప్పిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. మరి మునుముందు ఈ కంటెంట్ లో మార్పు ఏదైనా ఉంటుందేమో చూడాలి. మరోవైపు తెలుగు లో పెద్ద సినిమాలేవీ ఓటీటీలోకి రాకపోయినా అటు హిందీలో మాత్రం వరుసగా భారీ చిత్రాలు ఓటీటీల్లో రిలీజవుతూ వినోదం పంచుతున్నాయి. కొంతలో కొంత ఇవే సినిమాల్ని తెలుగు ఆడియన్స్ చూసి సంతృప్తి చెందుతున్నారు.