Begin typing your search above and press return to search.
2018 రివ్యూ: అమెరికా దోపిడీ
By: Tupaki Desk | 27 Dec 2018 4:25 AM GMT2018లో యథావిధిగా 100 సినిమాలు రిలీజైతే - 15శాతం సక్సెస్ రేటుతో టాలీవుడ్ ఫర్వాలేదనిపించిందని ప్రముఖ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అయితే అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది నికార్సయిన విజయాలు దక్కించుకున్న సినిమాలేవీ? పంపిణీదారులకు నష్టాలు రాకుండా కాపాడగలిగినవి ఏవి? అన్నది వెతికితే టాప్ 5 బంపర్ హిట్స్ జాబితా ఇలా ఉంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 2018 బాక్సాఫీస్ కింగ్ అనిపించాడు. చిట్టిబాబుగా అతడి నటనకు ఓవర్సీస్ జనం బ్రహ్మరథం పట్టారు. స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి చరణ్ వైవిధ్యంగా కనిపించాడు. చెవులు వినిపించని గోదారి కుర్రాడిగా రగ్గ్ డ్ బోయ్ గా హావభావాల్ని చెర్రీ అద్భుతంగా పండించాడన్న పేరొచ్చింది. దీంతో అసలు ఓవర్సీస్ మార్కెట్ తనకు అందని మావిగా ఉన్నా.. దాన్ని కూడా ఒడిసిపట్టాడు. రంగస్థలం చిత్రంతో రూ.25 కోట్లు ( $3,513,450) వసూలు చేసాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ క్లాస్ సీఎం భరత్ గా అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు - అటు ఓవర్సీస్ లోనూ `భరత్ అనే నేను` సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రంగస్థలం తో సమానంగా వసూలు చేసింది. రూ.25కోట్లకు అటూ ఇటూగా ($ 3,416,451) వసూలైంది.
ఆ తర్వాత సావిత్రి జీవితకథతో తెరకెక్కించిన `మహానటి` అమెరికా- విదేశీ ప్రేక్షకుల్ని మెప్పించింది. కీర్తిసురేష్ అభినయానికి ఓవర్సీస్- అమెరికా జనం బ్రహ్మరథం పట్టారు. మహానటి దాదాపు 18 కోట్లు ($2,543,515) వసూలు చేసింది. ఆ తర్వాత ఇంచుమించు అంతే గొప్ప ఫలితాన్ని అందుకుంది గీత గోవిందం. విజయ్ దేవరకొండ- రష్మిక మందనల మధ్య కెమిస్ట్రీ అమెరికా- విదేశీ జనాలకు అంతే గొప్పగా నచ్చేసింది. దీంతో `గీత గోవిందం` సుమారు రూ.17కోట్ల ($2,465,367) పైచిలుకు వసూళ్లను అందుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ `అరవింద సమేత` అమెరికాలో డాలర్లు కురిపించింది. ఈ సినిమా 15.34 కోట్లు( $2,181,943) వసూలు చేసింది. రంగస్థలం - భరత్ అనే నేను - మహానటి - గీత గోవిందం - అరవింద సమేత ఓవర్సీస్- అమెరికాలో 2018 టాప్ -5 చిత్రాలుగా రికార్డులకెక్కాయి.