Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ లో కోలుకోని తెలుగు సినిమా!
By: Tupaki Desk | 19 Sep 2021 2:30 AM GMTతెలుగు సినిమా ప్రపంచపటాన్ని తాకిన వేళ .. అక్కడి మార్కెట్ లో జెండా ఎగరేస్తున్న వేళ కరోనా కాలు పెట్టేసింది. ఒక తుఫాను ... ఒక సునామీ కంటే ఇది ఎంత ప్రమాదకారినో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైపోయింది. అన్ని రంగాల అభివృద్ధిపై ఆ ప్రభావం పడింది. చాలామంది తమ ఉపాథిని కోల్పోయి సొంత ఊళ్లకి తరలిపోయారు. అలా ప్రభావితమైన పరిశ్రమలలో చిత్రపరిశ్రమ కూడా ఒకటి. అన్నిటికంటే ఎక్కువ నష్టపోయిన పరిశ్రమ కూడా ఇదే.
ఒకప్పుడు ఒక సినిమా బిజినెస్ లో ఓవర్సీస్ మార్కెట్ ప్రభావం ఎక్కువగా కనిపించేది. ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు ఇక్కడి సినిమాలను ఎక్కువగా ఆదరించేవారు. తెలుగు రాష్ట్రాల వసూళ్లకి ఎంతటి ప్రాధాన్యత దక్కేదో, ఓవర్సీస్ వసూళ్లకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇచ్చేవారు. ఓవర్సీస్ లో ఏ హీరో సినిమా ఎంత వసూలు చేసిందనే రికార్డులను గురించి గొప్పగా చెప్పుకునేవారు. తమ హీరో సినిమా ఆ రికార్డును బద్దలు కొట్టేసి, కొత్త రికార్డును సెట్ చేయాలని కోరుకునేవారు. హీరోలు కూడా ఓవర్సీస్ వసూళ్లను పెంచుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు తాము చేసేవారు.
ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరిస్థితి ఎలా ఉన్నా , ఓవర్సీస్ వసూళ్లకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేసేవి. ఓవర్సీస్ హక్కుల రికార్డు .. వసూళ్ల రికార్డుకు ఒక ప్రత్యేకత తెచ్చేసి అందరి దృష్టిని ఆ వైపు మళ్లించారు. అక్కడి వసూళ్లే ఒక సినిమా విజయానికి అసలైన కొలమానమని భావించేవారు. కానీ అలాంటి పరిస్థితి కరోనా తరువాత కనుచూపు మేరలో కనిపించడం లేదు. ముఖ్యంగా సెకండ్ వేవ్ తరువాత ఏ ఒక్క తెలుగు సినిమా ఓవర్సీస్ లో వసూళ్ల రెపరెపలు వినలేకపోయింది. లాభాలు చూడలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాలో తెలుగు సినిమా పూర్తిగా డీలాపడిపోయింది.
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఆయా పనులు చూసుకోవడానికి దగ్గరలోని టౌన్లకు వచ్చి, పనులు పూర్తిచేసుకుని సినిమా చూసేసి వెళ్లే వాళ్లు ఎక్కువ. ఇందుకుగాను వాళ్లకి అయ్యే ఖర్చు కూడా తక్కువ. కానీ అమెరికాలాంటి చోట పరిస్థితి వేరు. సినిమా కోసమే వాళ్లు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాలి .. అలా వాళ్లు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చు ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లడానికి వాళ్లు జంకుతున్నారు. అంతేకాదు కాస్త ఓపిక పడితే ఓటీటీలో వచ్చేస్తాయనే నమ్మకం పూర్తిస్థాయిలో ఉంది. ఇక కొలువులు ఉంటాయో ఊడతాయో తెలియాని బెంగ ఉండనే ఉంది. అందువలన కరోనా అనేది పూర్తిగా కంట్రోల్ కి వస్తేనే తప్ప, ఓవర్సీస్ బిజినెస్ అనే మాట వినిపించడం కష్టంగానే ఉంది. నిజంగా ఇది యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు కోలుకొని దెబ్బే!