Begin typing your search above and press return to search.
జనవరి ఊపు ఫిబ్రవరిలోనూ..
By: Tupaki Desk | 7 Feb 2017 5:11 AM GMTతెలుగు సినిమాకు సుడి తిరిగినట్లుగా ఉంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే. ఈ ఏడాది స్టార్టింగ్ అదిరిపోవటం.. తాజాగా అది కంటిన్యూ అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా నాలుగు సినిమాలు విడుదల అయితే.. ఒక సినిమా మాత్రమే సూపర్ హిట్ కావటం ఉంటుంది. కానీ.. నాలుగు సినిమాలురిలీజ్ అయితే మూడు సినిమాలు సూపర్ హిట్లు కావటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన సీన్ ఈ ఏడాది స్టార్టింగ్ లో కనిపించి సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఈ ఏడాది ప్రారంభంలో బోణీ కొట్టిన చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబరు 150 సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఖైదీ రిలీజ్ అయిన తర్వాతి రోజునే విడుదలైన గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ కావటంతో పరిశ్రమ యావత్తు పండగ చేసుకుంది. అందరి అంచనాలకు తగ్గట్లే పండగ రోజు విడుదలైన శతమానం భవతి సినిమాకు కలెక్షన్ల వర్షం కురవటంతో ఈ ఏడాది ఆరంభం అదిరిపోయిందన్న మాట వినిపించింది. భారీ సినిమాల మధ్యన వచ్చిన ఆర్ నారాయణమూర్తి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యకు నిరాశ తప్పలేదు.
ఆ తర్వాత కాస్త గ్యాప్ తో వచ్చిన లక్కున్నోడు ఓకే అనిపించింది. అలా జనవరి ముగిస్తే.. ఫిబ్రవరి స్టార్టింగ్ లో రిలీజ్ అయిన కనుపాప డబ్బింగ్ మూవీ మంచిపేరు తెచ్చుకుంది. ఇక.. నాని హీరోగా నటించిన నేను లోకల్ బాగా రన్ కావటం.. కలెక్షన్లు కొల్లగొట్టటం టాలీవుడ్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది.
ఇక.. ఈ వారం విడుదల కానున్న ఓం నమో వెంకటేశాయ.. సింగం మీదన చాలానే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ పక్కా అన్న మాట వినిపిస్తోంది.ఇక.. మూడో వారంలో విడుదలయ్యే ఘాజీ మీద ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరటం తెలిసిందే. ఈ నెలాఖరులో రానున్న విన్నర్ మీదా అంచనాలు బాగున్న నేపథ్యంలో.. జనవరి మాదిరే ఫిబ్రవరిలోనూ సినిమాలు సక్సెస్ ఫుల్ గా నడిచే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే టాలీవుడ్ కి కావాల్సిందేముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/