Begin typing your search above and press return to search.
ఈ వారం ఆ నాలుగు సినిమాలే
By: Tupaki Desk | 2 Jan 2018 4:00 PM GMTఎప్పుడు లేని విధంగా 2017 నవంబర్ లో ప్రతి వారం ఐదు సినిమాలకంటే ఎక్కువనే రిలీజ్ అయ్యాయి. డబ్బింగ్ సినిమాలతో పాటు డైరెక్ట్ తెలుగు చిన్న సినిమాలు అందులో ఉన్నాయి. ఇక ఆ తరువాత డిసెంబర్ లో మరికొన్ని రిలీజ్ అయ్యాయి. అయితే నవంబర్ నుంచి డిసెంబర్ చివరి వరకు రిలీజ్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇక కొత్త ఏడాదిలో సంక్రాంతి నుంచి మరికొన్ని పెద్ద సినిమాలతో పాటు మీడియం రేంజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
అయితే టాలీవుడ్ ఎప్పుడు లేని విధంగా 2018 కొత్త ఏడాది మొదటి వారాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. ఒక్క డైరెక్ట్ తెలుగు సినిమా కూడా మొదటి నెల మొదటి వారంలో రిలీజ్ అవ్వడం లేదు. అయితే ఈ అవకాశాన్ని ఇతర ఇండస్ట్రీ సినిమాలు బాగా వాడుకుంటున్నాయి. ఏ మాత్రం మంచి చెడు అని ఆలోచించకుండా 4 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో రెండు హాలీవుడ్ సినిమాలు అలాగే రెండు చిన్న సినిమాలు ఉన్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అడ్వెంచర్ మూవీ అమెజాన్ ఎడ్వెంచర్ అలాగే ఇన్సిడియస్ అనే హాలీవుడ్ సినిమాలతో పాటు ఈగో - సారధి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ఈగో ఒక్కటి తెలుగు సినిమా కాగా సారధి డబ్బింగ్ సినిమా. ఈ రెండు సినిమాలపై ఎటువంటి అంచనాలు లేవు. ప్రమోషన్స్ కూడా పెద్దగా జరగలేదు. కానీ హాలీవుడ్ సినిమాలకు మల్టిప్లెక్స్ లలో భారీ ఆదరణ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ టైమ్ ని ఆ నాలుగు సినిమాలు ఎంతవరకు ఉపయోగించుకుంటాయో చూడాలి.