Begin typing your search above and press return to search.
నవంబర్ లో మినీ సిని యుద్ధం
By: Tupaki Desk | 16 Oct 2017 9:42 AM GMTసాధారణంగా వెండితెరపై సినిమాల మధ్య పోటీ ఉండడం కామన్. కానీ కొన్ని సార్లు పెద్ద సినిమాలతో చిన్న సినిమాలు పోటీ పడటం అంతగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు సినిమాలో కంటెంట్ పై నమ్మకం ఉంటే చిత్ర నిర్మాతలు సినిమాలను డేర్ గా రిలీజ్ చేస్తున్నారు. అదే విధంగా కొన్ని చిన్న సినిమాలు మాత్రం సరైన డేట్ ని చూసుకొని విడుదల అవుతున్నాయి. ఎంత కొంత రాబట్టుకోవాలని ఏ పెద్ద సినిమాలు లేనప్పుడే రిలీజ్ చేస్తున్నారు కొందరు నిర్మాతలు.
అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ కొన్ని సినిమాలు బాక్సీ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. వాటి పై అంచనాలు లేకున్నా కూడా అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి రెడీ అయ్యాయి. నవంబర్ 3న శుక్రవారం నాడు నాలుగు సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. నెక్స్ట్ నువ్వే - ఏంజిల్ అండ్ మెంటల్ మదిలో అలాగే కోలీవుడ్ హీరో విశాల్ డిటెక్టివ్ కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ సినిమాలపై అంతగా అంచనాలు ఏమి లేవు. సాయి కుమార్ తనయుడు ఆది మొదటి సారి హర్రర్ ప్రయత్నంలో ఈటివి ప్రభాకర్ డైరెక్షన్ లో నెక్స్ట్ నువ్వే తెరకెక్కింది. ఇక ఏంజిల్ సినిమాలో హెబ్బా పటేల్ ఉండడంతో ఓ వర్గం వారిలో ఆసక్తి ఉంది. డిటెక్టివ్ గా విశాల్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో తెలియదు. ఇక మెంటల్ మదిలో సినిమాను సైలెంట్ గా థియేటర్స్ లోకి రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్.
అదే విధంగా గోపీచంద్ ఆక్సిజన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. కాని అధికారికంగా ఇంకా డిసైడ్ కాలేదు. ఇక పీఎస్వి గరుడ వేగ కొంచెం గ్యాప్ తీసుకొని రిలీజ్ అవుతోంది. అలాగే సందీప్ కిషన్ co సూర్య కూడా ఆ నెక్స్ట్ వీక్ లో పోటీ పడటానికి సిద్దమయ్యాడు. మరి ఈ మినీ యుద్ధంలో ఎంతవరకు ఎవరు సక్సెస్ అందుకుంటారో అంతు చిక్కడం లేదు. కానీ రిలీజ్ కు అదే బెస్ట్ టైమ్ అని అందరు భావిస్తున్నారు. చూడాలి మరి నవంబర్ వీరికి ఎంతవరకు లాభాన్ని ఇస్తుందో..