Begin typing your search above and press return to search.
రజనీ అంటే భయం లేదా?
By: Tupaki Desk | 30 Nov 2018 11:46 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే.. దక్షిణాదిన ఏ రాష్ట్రంలోనూ దానికి పోటీగా మరో సినిమా రిలీజ్ చేయరు. ముదు వెనుక వారాల్లోనూ సినిమాలు దించడానికి భయపడతారు. ఐతే గత కొన్నేళ్ల నుంచి రజనీ హవా నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా ‘కబాలి’.. ‘కాలా’ లాంటి సినిమాలతో రజనీ మార్కెట్ బాగా దెబ్బ తింది. ఆ ప్రభావం ఇప్పుడు ‘2.0’ మీదా కనిపిస్తోంది. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టలేకపోతోంది. ఇలాంటి మెగా మూవీ బరిలో ఉందని తెలిసి కూడా.. వచ్చే వారం భయం లేకుండా ఏకంగా ఆరేడు సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘కవచం’తో పాటు సుమంత్ చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’ ఆల్రెడీ డిసెంబరు 7వ తేదీకి షెడ్యూల్ అయ్యాయి. ఇవి చాలవన్నట్లు సందీప్-తమన్నాల ‘నెక్స్ట్ ఏంటి’తో పాటు ‘హుషారు’.. ‘శుభలేఖలు’.. ‘భైరవగీత’ కూడా రేసులోకి వచ్చాయి. ‘మోర్టల్ ఇంజిన్స్’ అనే ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమా కూడా రంగంలోకి దిగుతోంది. ‘2.0’కు టాక్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం సినిమాలు రిలీజ్ చేసే విషయంలో వెనక్కి తగ్గుతారేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అన్నీ అదే డేటుకి ఫిక్సయ్యాయి. ఎవరికి వాళ్లు రిలీజ్ డేట్ పోస్టర్లతో తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అంటే వచ్చే వారం వచ్చేసరికి ‘2.0’ నిలవలేదని.. దాని జోరు తగ్గిపోతుందని ధీమా కావచ్చు. ముఖ్యంగా ఈ చిత్రం త్రీడీ థియేటర్లలో మాత్రమే బాగా ఆడుతోంది. రెగ్యులర్ థియేటర్లలో అప్పుడే వసూళ్లు పడిపోయాయి. కాబట్టి దాని ప్రభావం ఉండదని ధీమా కావచ్చేమో.