Begin typing your search above and press return to search.
'ఆహా అవార్డ్స్' కు శ్రీకారం చుట్టిన తెలుగు ఓటీటీ..!
By: Tupaki Desk | 30 Oct 2021 12:31 PM GMT100 శాతం తెలుగు కంటెంట్ తో వచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'.. దిగ్గజ ఓటీటీలకు ధీటుగా నిలుస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఆసక్తికరమైన సరికొత్త కంటెంట్ ని అందిస్తూ సక్సెస్ ఫుల్ గా 20 నెలలు పూర్తి చేసుకుంది. బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటుగా స్పెషల్ టాక్ షో లు - ఒరిజినల్ సిరీస్ లతో వీక్షకులను అలరిస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఆహా టీమ్ సత్కరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ‘ఆహా అవార్డ్స్’ తో రాబోతున్నట్లు ప్రకటించింది.
''మీకు ఇష్టమైన యాక్టర్స్ మరియు అత్యంత ఇష్టమైన కథలను సెలబ్రేట్ చేసుకునే సమయం ఇది. ఆహా పీపుల్ ఛాయిస్ అవార్డులను అందజేయడం అనేది కళను మరియు కళాకారులను గౌరవించుకోవడంగా భావిస్తున్నాం'' అని 'ఆహా' టీమ్ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ క్రమంలో ప్రేక్షకులు ఉత్తమైన వారికి ఓట్ చేయవలసిందిగా లింక్ ని కూడా పోస్ట్ చేసింది. ఇందులో వెబ్ సిరీస్ మరియు మూవీస్ లను రెండు సెక్షన్స్ గా విభజించారు. బెస్ట్ ఫిల్మ్ - బెస్ట్ వెబ్ సిరీస్ - డైరెక్టర్ - బెస్ట్ యాక్టర్ (మేల్) - బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) - సపోర్టింగ్ యాక్టర్ (మేల్) - బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫిమేల్) - కమెడియన్ - బెస్ట్ డెబ్యూట్ (మేల్) - డెబ్యూట్ (ఫిమేల్) - బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - బెస్ట్ నాన్ ఫిక్షన్ వంటి కేటగిరీలను ఉంచారు.
''20 నెలలు, 50 మిలియన్ల వినియోగదారులు, 13 మిలియన్లకు పైగా ఇన్స్టాల్స్! ప్రారంభించినప్పటి నుండి, విభిన్నమైన కంటెంట్ లైబ్రరీతో సక్సెస్ అవడం వెనుక ఆహా కృషి ఎంతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వీక్షకులకు వన్-స్టాప్ డెస్టినేషన్ గా ఏర్పాటైన స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్.. తన ప్రేక్షకులను అలరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆహా 100% ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ అనేది గత 20 నెలల్లో కళాత్మక మరియు సాంకేతిక నైపుణ్యాన్ని గౌరవించే కార్యక్రమంగా భావిస్తున్నాం. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వారిని ఎంచుకోవడానికి ఇది మీకు ఒక అవకాశం కల్పిస్తుంది'' అని ఆహా వెల్లడించింది.

It's time to celebrate your favorite actors and most loved stories! Presenting aha's people choice awards- a little something to honor the art and its artists