Begin typing your search above and press return to search.
జనాలు ఒక క్లాసిక్ గా అనుకోవట్లేదా?
By: Tupaki Desk | 1 Aug 2015 9:55 AM GMTభారతీయ సినిమా చరిత్రలో అసాధారణ విజయం సాధించిన సినిమా బాహుబలి. ఓ ప్రాంతీయ సినిమా బాలీవుడ్ సినిమాతో పోటీపడి 500కోట్ల వసూళ్లు సాధించడం అంటే ఆషామాషీ కాదు. అయితే అంతటి రికార్డ్ హిట్ సినిమాని ప్రేక్షకులు అప్పుడే మర్చిపోయే పరిస్థితి వచ్చేసింది. రిలీజై ఇప్పటికి కేవలం మూడు వారాలే. నెలరోజులైనా పూర్తి కాలేదింకా. అయినా ఎక్కడా ఈ సినిమాకి సంబంధించిన డిష్కసనే కనిపించడం లేదు.
ఆటోవాళ్లు, ప్రయివేటు బస్సుల్లో, కాకా హోటళ్ల లో, దాబాల్లో ఎక్కడా ఈ సినిమా గురించిన చర్చేలేదు. పేల్చడానికి ఉపయోగపడే ఒక్క డైలాగ్ అయినా లేదు. పాటలు అసలే బాలేదు. అసాధారణమైన స్క్రీన్‌ప్లే లేదు. హీరోయిజాన్ని అంత అద్భుతంగా చూపించిందే లేదు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం గురించే ఎవరైనా ముచ్చటించుకుంటున్నారు. పాత సినిమాలతో పోల్చి చూస్తే నాశిరకం సినిమాగా తేల్చేస్తున్నారు కొందరు ఇంకా.
ఆ రోజుల్లో మాయాబజార్, దేవదాసు, జగదేక వీరుని కథ, పాతాళ భైరవి, గుండెమ్మకథ, మూగమనసులు .. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్ని ప్రేక్షక జనం పదే పదే మననం చేసుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు ముచ్చటించుకున్నారు. అయితే వాటితో పోలిస్తే బాహుబలి సాధించిన విజయం అసాధారణమైనది. దేశంలోనే ఏ సినిమా నెలకొల్పనన్ని రికార్డుల్ని నెలకొల్పింది. అయినా వెంటనే మర్చిపోయే పరిస్థితి. జనాలు ఒక క్లాసిక్ సినిమాగా అనుకోవట్లేదు. విసువల్ వండర్ గానే చూస్తున్నారు.
ఏదేమైనా సినిమా బావుందా? లేదా? అన్నది చెప్పాల్సింది కలెక్షన్లు. అవి చూస్తే సరిపోవడం లేదా? అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేం.