Begin typing your search above and press return to search.
నాగార్జున గ్రేట్ ఫ్రెండ్ మృతి
By: Tupaki Desk | 27 Oct 2018 4:22 AM GMTకింగ్ నాగార్జున స్నేహితుడు - ప్రముఖ నిర్మాత డి.శిప్రసాద్ రెడ్డి (62) కన్ను మూశారు. హృదయ సంబంధ సమస్యతో గత కొంతకాలంగా చెన్నై- అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. శనివారం ఉదయం ఆరున్నర గంటలకు పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారని తెలుస్తోంది.
1985లో కామాక్షి మూవీస్ బ్యానర్ ను స్థాపించి కార్తీక పౌర్ణమి - శ్రావణ సంధ్య - విక్కీ దాదా - ముఠా మేస్త్రి - అల్లరి అల్లుడు - ఆటోడ్రైవర్ - సీతారామరాజు - ఎదురులేని మనిషి - నేనున్నాను - బాస్ - కింగ్ - కేడీ - రగడ - ధడ - గ్రీకువీరుడు సినిమాలను నిర్మించారు. డి.శివప్రసాద్ రెడ్డి నాగార్జునకు చిన్ననాటి స్నేహితుడు. విక్కీదాదాతో తొలిసారి నిర్మాతగా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అటుపై వరుసగా నాగార్జునతోనే ఆయన సినిమాలు నిర్మించారు. విక్కీదాదా నుంచి గ్రీకువీరుడు వరకూ వరుసగా నాగార్జునతోనే సినిమాలు నిర్మించారాయన. నాగార్జున వారసుడు నాగచైతన్యతో ధడ చిత్రం నిర్మించారు. అయితే కెరీర్ చివరినాళ్లలో సరైన విజయాలు దక్కలేదు. కేడీ - ధడ - గ్రీకువీరుడు చిత్రాలు ఫ్లాపులయ్యాయి. దీంతో అటుపై సినిమా నిర్మాణానికి దూరంగానే ఉంటున్నారు.
శివప్రసాద్ రెడ్డి నిర్మాతగా ఉన్నన్నాళ్లు అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జునతో కలిసి మీడియా సమావేశాల్లో సరదాగా గడిపేసేవారు. ఎంతో నిగర్వి. ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనలో అందరికీ నచ్చేది. తాను సినిమాలు తీస్తే నాగార్జునతో తప్ప వేరొకరితో తీయను అనేవారు. స్నేహితుడికి విలువిచ్చి నాగార్జున ఆయనకే అవకాశం ఇచ్చారు. ఆ ఇద్దరి మధ్యా స్నేహం అంత గొప్పది. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలుస్తోంది. శివప్రసాద్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.