Begin typing your search above and press return to search.
ఇక్కడ కన్నా అక్కడే సుఖం
By: Tupaki Desk | 14 Dec 2017 5:30 PM GMTకాలం మారినా.. టెక్నాలజీ పెరిగినా.. కొత్త ట్రెండులు వచ్చినా అప్పటికీ.. ఇప్పటికీ తెలుగు సినిమాల్లో పాటల ప్రాధాన్యం ఏమీ తగ్గలేదు. ఒకప్పుడు సినిమా హిట్ ను నిర్దేశించడంలో ఆడియో కీలకంగా ఉండేది. ఇప్పుడంత కీలకం కాకపోయినా సినిమాపై బజ్ పెంచడంలో పాటలు చాలా ఇంపార్టెంట్ గా మారిపోయాయి. ప్రేక్షకుల ఆసక్తిని ప్లస్ పాయింట్ గా మార్చుకోవడానికి పాటల విషయంలో దర్శక నిర్మాతలతోపాటు హీరోలు సైతం ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు.
మిగతా పాటల సంగతి ఎలా ఉన్నా డ్యూయట్లలో అధిక శాతం ఫారిన్ లోనే చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరోహీరోయిన్ల వెనుక ఎక్స్ ట్రాలుగా ఫారిన్ డ్యాన్సర్లు చాలా సినిమాల్లో కనిపించారు. దాదాపుగా ప్రతి పెద్ద సినిమాలో ఇలాంటి పాట ఒకటి అయినా పెడుతున్నారు. అంతదూరం వెళ్లి షూట్ చేసుకురావడం కాస్త కష్టమే అయినా ఇక్కడ కన్నా అక్కడ తీయడమే హాయిగా ఉంటుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. పాటల్లో హీరో హీరోయిన్లతో పాటు ఫారిన్ డ్యాన్సర్లు కనిపించడం వల్ల ఓ ఫ్రెష్ లుక్ వస్తుందని అంటున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ‘‘ఓ పాట ఇక్కడ తీయాలంటే పెద్ద సెట్టు.. భారీ ఎక్స్ ట్రాలు ఉండాలి. అదే ఫారిన్ లో ఎక్స్ ట్రాలుగా స్టెప్పులేసే వాళ్లకు ఒక్కోరికి 200 డాలర్లు ఖర్చుపెడితే చాలు. ఖర్చు కూడా అక్కడ... ఇక్కడ సమానంగానే ఉంటుందని’’ చెబుతున్నారు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.
‘‘మన దగ్గర ఓపెన్ ప్లేసులో షూటింగ్ చేయడమంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. చుట్టూరా అభిమానులు- జనాల హడావుడితో పని ముందుకు కదలదు. అదే ఫారిన్ లో అయితే ఈ హడావుడి ఏమీ ఉండదు. ప్రశాంతంగా పని పూర్తి చేయవచ్చు. దానికితోడు అందమైన కొత్త లొకేషన్లలో పాట అంటే ప్రేక్షకులకు కూడా విజువల్ ట్రీట్ లా ఉంటుంది’’ అని అంటున్నారు డైరెక్టర్ సుకుమార్. సో.. అలా ఖర్చు తక్కువ.. కన్వీనియన్స్ ఎక్కువగా ఉన్నందువల్లనే లోబడ్జెట్ సినిమాల దర్శక.. నిర్మాతలు కూడా ఛలో ఫారిన్ అంటున్నారన్న మాట.