Begin typing your search above and press return to search.
అలాంటి రోల్స్ మనోళ్ళకు భయమే
By: Tupaki Desk | 5 July 2018 4:13 AM GMTప్రయోగాలు చేయాలంటే తమిళ సినిమాలే ముందు. కాని తెలుగు మేకర్లు మాత్రం.. భారీ బడ్జెట్ సినిమాలను తీయడంలో ముందు. అయితే ప్రయోగాత్మక సినిమాలే కాకుండా రియల్ లైఫ్ రోల్స్ చేయాలన్నా కూడా మనోళ్ళు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా బయోపిక్స్ లో క్యారక్టర్లు అంటేనే భయపడుతున్నారు.
వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర' కోసం నిజంగానే కొంతమంది తెలుగు స్టార్లను అనుకున్నాడట దర్శకుడు మహి వి రాఘవ్. అయితే ఆ పాత్రను చేస్తే తమను ఆ పార్టీకి చెందినవారిగా ముద్రేస్తారని ఎవ్వరూ ముందుకురాలేదట. ఆ తరువాత మళయాళ స్టార్ మమ్ముట్టి ఓకె అన్నాడు. ఇక అప్పట్లో రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్రలో పరిటాల రవి పాత్రను చేయడానికి కూడా చాలామంది నో అంటే.. చివరకు వివేక్ ఒబెరాయ్ ను దించాడు వర్మ. మొన్న మహానటి సినిమాలో కూడా జెమిని గణేశన్ పాత్ర కోసం చాలామంది తెలుగు హీరోలను అడగ్గా అందరూ నో అనే చెప్పారట. తన స్నేహితుడు విజయ్ దేవరకొండ కూడా కాస్త మొహమాటపడుతుండటంతో.. చివరకు జెమిని పాత్రకు డల్కర్ సల్మాన్ ను వెతికి పట్టుకున్నారట.
మొత్తానికి ఏదన్నా కాంట్రోవర్శీ లేదా పొలిటికల్ టచ్ ఉన్న పాత్రలు చేయాలంటే మాత్రం.. తెలుగు హీరోలు భయపడుతున్నారు అని ఈ విషయంలో మనకు క్లియర్ గా అర్ధమవుతోంది. మరి ఎన్టీఆర్ బయోపిక్ లో అలాంటి రోల్స్ ఎలా చేస్తారో చూడాల్సిందే.